
నిర్మల్ మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్
సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
నిర్మల్ అర్బన్, జనవరి 7 : ఉద్యోగుల పాలిట సీఎం కేసీఆర్ దేవుడు అని నిర్మల్ మున్సిపల్ చై ర్మన్ గండ్రత్ ఈశ్వర్ అభివర్ణించారు. రాష్ట్ర ప్ర భుత్వం పారిశుధ్య కార్మికులు, అవుట్ సో ర్సింగ్ ఉద్యోగులకు 30 శాతం వేతనాలు పెంచడాన్ని హర్షిస్తూ వారి ఆధ్వర్యంలో శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో సీఎం కేసీఆర్ చిత్రపటాని కి పాలాభిషేకం చేశారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు స్వీట్లు పంచిపెట్టారు. చైర్మన్ మాట్లాడు తూ.. స్వరాష్ట్రంలోనే ఉద్యోగులకు మహర్దశ వ చ్చిందన్నారు. పారిశుధ్య కార్మికుల కష్టాలను స్వ యంగా గుర్తించిన కేసీఆర్, దశల వారీగా వేతనాలు పెంచుతున్నారని గుర్తుచేశారు. కౌన్సిలర్లు గండ్రత్ రమణ, బిట్లింగ్ నవీన్, ఎడిపెల్లి నరేందర్, నల్లూరి పోశెట్టి, ఎస్పీ రాజు, మున్సిపల్ ఉద్యోగులు ఫయాజ్, రామకృష్ణ పాల్గొన్నారు.