
పూర్తిస్థాయి నీటిమట్టానికి కడెం
ప్రత్యేక పూజలు చేసిన అధికారులు
కడెం, అక్టోబర్ 6 : కడెం ప్రాజెక్టు నిర్మించిన 70 ఏండ్ల చరిత్రలో ఈ ఏడాది జలాశయలో నీరు పూర్తిస్థాయి నీటిమట్టం నిల్వ ఉంచ డం ఆనందంగా ఉందని కడెం ప్రాజెక్టు ఈఈ రాజశేఖర్ పేర్కొన్నారు. బుధవారం ఆయన నీటిపారుదలశాఖ అధికారులతో కలిసి డ్యాం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొబ్బరికా యలు కొట్టి, పూలను నీటిలో చల్లారు. అనంత రం ఆయన మాట్లాడుతూ కడెం ప్రాజెక్టు 70 ఏండ్ల చరిత్రలో 20 ఏండ్లలో ఒక్కసారి పూర్తిస్థా యి నీటిమట్టాన్ని నిల్వ ఉంచగా, తిరిగి ఈ ఏడాది నిల్వ ఉంచినట్లు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 700 అడుగులు (7.603 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 700 అడుగులు (7.603 టీఎంసీల) నీటిని నిల్వ ఉంచినట్లు పేర్కొన్నారు. వానకాలం నుంచి ఇప్పటి వరకు వచ్చే వరదను దిగువకు వదులు తూ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిని నిల్వ ఉంచామ ని పేర్కొన్నారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఖానా పూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్, నడిపెల్లి దివాకర్‌రావు, నీటి పారుదలశాఖ ఉన్నతాధి కారులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో వస్తుండడంతో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఒక్క వరదగేటును ఎత్తి 4178 క్యూసెక్కులు నీటిని దిగువకు విడుదల చేశారు. డ్యాం ఇన్చార్జిగా పని చేసిన ఏఈ ఉదయ్ కిరణ్‌ను ఈఈ, డీఈ అభినందించారు. కార్యక్ర మంలో డీఈ బోజదాసు, ఏఈ ఉదయ్‌కిరణ్, శ్రీధర్, రాజు, ఆయకట్టు సిబ్బంది, తదితరు లున్నారు.