
గిరిజనుల ఆధ్వర్యంలో ర్యాలీ
కేసీఆర్ ప్రసంగంపై ఏజెన్సీ ఆదివాసీల హర్షం
ఇంద్రవెల్లి, అక్టోబర్ 6 : ఏజెన్సీ ప్రాంతంలో పోడు భూముల సమస్యలను త్వరలో పరిష్కరిం చి, పట్టాలు ఇస్తామని, మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన లంబాడాలు ఇక్కడ ఎస్టీలుగా చెలామణి అవుతున్నారని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటిం చడంపై ఆదివాసీ గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తు న్నారు. ఆదివాసీ గిరిజనులతోపాటు తుడుందెబ్బ నాయకుల ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రంలోని గోండ్‌గూడ నుంచి తెలంగాణ తల్లి విగ్రహం వరకు సంప్రదాయ వాయిద్యాలు వాయిస్తూ కేసీఆర్ చిత్రపటంతో ర్యాలీ తీశారు. తెలంగాణ తల్లి చౌక్‌లో కేసీఆర్ చిత్రపటానికి ఆది వాసీ గిరిజనులు పాలాభిషేకం చేశారు. ఈ సంద ర్భంగా పలువురు ఆదివాసీ గిరిజన నాయకులు మాట్లాడుతూ తమ సమస్యలను సీఎం కేసీఆర్ గుర్తించడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. ఆదివాసీ గిరిజన మహిళా సంఘం జిల్లా అధ్యక్షు రాలు పెందూర్ పుష్పరాణి, తుడుందెబ్బ మండ లాధ్యక్షుడు జుగ్నాక్ భారత్, ఆదివాసీ గిరిజన సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు కినక జుగా ది రావ్, తుడుందెబ్బ మండల గౌరవ అధ్యక్షుడు మెస్రం నాగ్నాథ్, ఆదివాసీ గిరిజన ఉద్యోగుల సంఘం నాయకులు కుడిమేత గోద్రు, గెడాం జ్ఞానేశ్వర్, మెస్రం దేవ్‌రావ్, విద్యార్థి సం ఘం మండల అధ్యక్షుడు పుర్కా చిత్రు, సర్పంచ్ లు గోడం నాగోరావ్, కుమ్ర మోహన్రావ్, నాయ కులు మడావి భీంరావ్, గెడాం భారత్, హను మంత్రావ్, తోడసం నాగోరావ్, మెస్రం కైలాస్, ప్రభాకర్, సంతోష్, రాందాస్ పాల్గొన్నారు.
కెస్లాపూర్‌లో..
ఇంద్రవెల్లి, అక్టోబర్ 6 : పోడు భూముల సమ స్యలను పరిష్కరించి, పట్టాలు అందిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో కెస్లాపూర్ గ్రామ స్తులు ఆదివాసీ గిరిజనుల ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భం గా పలువురు మాట్లాడుతూ మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన లంబాడాలతో ఏజెన్సీలోని ఆదివా సీ గిరిజనులకు జరుగుతున్న అన్యాయాన్ని సీఎం గుర్తించడం హర్షణీయమని పేర్కొన్నారు. కెస్లాపూ ర్ గ్రామ పటేల్ మెస్రం వెంకట్రావ్ పటేల్, సర్పంచ్ మెస్రం రేణుకానాగ్‌నాథ్, గ్రామస్తులు నాగ్నాథ్, ఆనంద్‌రావ్, లంబారావ్, బాధిరావ్, తోడసం సాగర్, తదితరులు పాల్గొన్నారు.