
కోతల్లో రైతన్నలు నిమగ్నం
గతేడాది కంటే మద్దతు ధర రెట్టింపు
నిర్మల్ టౌన్, అక్టోబర్ 5 :పత్తికి ప్రత్యామ్నాయంగా వేసిన సోయా పంట చేతికొస్తున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1,87,397 ఎకరాల్లో సాగు చేయగా, 11.74 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశమున్నది. ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.3895 మద్దతు ధర ప్రకటించగా, ప్రైవేట్ వ్యాపారులు తేమ, నాణ్యతను బట్టి రూ.6 వేల నుంచి 6,800 వరకు చెల్లిస్తున్నారు. గతేడాది కంటే రెట్టింపు ధర వస్తుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ ప్రభు త్వం పత్తికి ప్రత్నామ్నాయంగా సోయా సాగు చేయాలని వానకాలానికి ముందే ప్రచారం చేసింది. దీంతో సోయా సాగు చేసిన రైతులు పంట చేతికి రావడంతో సంబురపడిపోతున్నా రు. ఈసారి వానకాలం సీజన్ ప్రారంభం నుం చే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు కురిశాయి. దీంతో పాటు వాతావరణం అనుకూలంగా ఉండడం తో సోయా దిగుబడులు బాగానే వస్తాయని రైతులు ధీమాతో ఉన్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1,87,397 ఎకరాల్లో సాగు..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1,87,397 ఎకరాల్లో సోయా సాగు చేశారు. ఆదిలాబాద్ జి ల్లాలో 70,090 ఎకరాలు, నిర్మల్‌లో 81, 801, మంచిర్యాలలో 3500, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 32 వేల ఎకరాల్లో సో యాను సాగు చేసినట్లు వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు. జూన్, జూలైలో కురిసిన వర్షాలకు రైతులు సోయా విత్తనాలు వేయగా.. సెప్టెంబర్ చివరి వారం నాటికే పం ట చేతికి రావాల్సి ఉంది. ఇటీవల కురిసిన వ ర్షాల నేపథ్యంలో వారం రోజులు ఆలస్యమైం ది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పంటను కోసి ధాన్యాన్ని ప్రైవేట్ మార్కెట్లో విక్రయిస్తున్నారు. వారం రోజుల నుంచి హార్వెస్టర్ల సాయంతో పచ్చిభూముల్లో సైతం చైన్ మిషన్ల సాయంతో సోయా పంటను కోస్తుండగా.. మహారాష్ట, బిహార్ కూలీలను ఉపయోగించుకొని పంటను కోసి ఆరబెట్టి మార్కెట్‌కు తరలిస్తున్నారు.
గతేడాది కంటే ధర రెట్టింపు..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సోయా పం ట ను సాగు చేస్తున్న రైతులకు ఈ వానకాలం సీజ న్ కలిసివచ్చింది. ప్రభుత్వం సోయా పంటకు క్వింటాల్‌కు రూ.3895 మద్దతు ధర ప్రకటించగా.. ఇప్పటికే ప్రైవేట్ వ్యాపారులు సోయా పంట తేమ, నాణ్యతను బట్టి రూ.6 వేల నుం చి 6,800 వరకు కొనుగోలు చేస్తున్నట్లు రైతు లు పేర్కొంటున్నారు. ముఖ్యంగా జిల్లాలోని భైంసా, కుభీర్, ఇచ్చోడ, ఆదిలాబాద్, బోథ్, ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ తదితర ప్రాం తాల్లో దళారులు రైతుల వద్దకు వచ్చి క్వింటాల్‌కు రూ.6 వేల నుంచి 6,800 వరకు చెల్లిస్తున్నారు. గతేడాది ఇదే సీజన్లో రూ. 3200 నుంచి 3800 వరకు ధర పలుకగా.. ఈసారి రెట్టింపు ధరలు లభిస్తున్నాయి. ప్రభుత్వం ఈసారి సబ్సిడీ సోయా విత్తనాలను సరఫరా చేయకపోవడంతో రైతులు ప్రైవేట్‌లోనే సో యా విత్తనాలను కొనుగోలు చేసి నాణ్యమైనవి విత్తుకోవడంతో దిగుబడులు కూడా బాగానే ఉన్నట్లు పేర్కొంటున్నారు. ఎకరానికి 6 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి వస్తుండడంతో మొ త్తంగా 11.74 వేల క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మద్దతు ధరతో పోల్చితే ఎకరానికి రూ.40వేల వరకు ఆదాయం వచ్చే అ వకాశం ఉంది. సోయా పంటకు తక్కువ ఖ ర్చులు ఉండడం, 90 రోజుల్లోనే చేతికి రావ డం, వానకాలం సీజన్లో మొదటి పంట ఇదే కావడంతో రబీకి అవసరమయ్యే పెట్టుబడి కూడా ఈ పంట విక్రయించగా.. వచ్చిన ఆదా యం కావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర, బిహార్‌కు చెందిన కూలీలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సోయా పంటను కోత కోయడం, నూర్పిడి చే యడం, మార్కెట్ కు తరలించడం వంటి ప నులు చేస్తుండడంతో రైతులకు ఎలాంటి ఇ బ్బందులు తలెత్తవు.
మహారాష్ట్ర కూలీలతో కోసినం..
సోయా పంటను కో సేందుకు హార్వెస్టర్ల కొరత ఉం ది. దీం తో మహారా ష్ట్ర నుం చి కూలీలను తీసుకువచ్చిన. ఎకరానికి రూ. 3,500 లకు పంట కోసి కుప్ప వేశారు. మహారాష్ట్ర, బిహర్ కూలీలు రైతులకు చేయూతనందించడంతో ఎలాంటి ఇబ్బందులు లేవు.
భూమన్న రైతు,కుంటాల
భీంపూర్, అక్టోబర్ 5: భీంపూర్, బేల్సరిరాంపూర్లో బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. జడ్పీటీసీ కుమ్ర సుధాకర్, టీఆర్ఎస్ మండల కన్వీనర్ మేకల నాగయ్య, ప్రధాన కార్యదర్శి ఉత్తం రాథోడ్, సర్పంచ్‌లు మడావి లింబాజీ, చిన్ను, రూప, పెండెపు కృష్ణ యాదవ్, ఉపసర్పంచ్ జాదవ్ రవీందర్, కార్యదర్శి సాయినందన, నాయకులు పురుషోత్తం,కుడిమెత సంతోష్, ధరంసింగ్, పాండురంగ్ పాల్గొన్నారు.
ఉట్నూర్ రూరల్, అక్టోబర్ 5: మండలంలోని హస్నాపూర్‌లో సర్పంచ్ ఉపేందర్ మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ అశోక్, సీసీ సులోచన, పరుశురాం, వార్డు సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.
నార్నూర్, అక్టోబర్ 5: మండలంలోని నాగల్కొండలో సర్పంచ్ జాదవ్ సునీత ఆధ్వర్యంలో బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ కళావతి, ఉప సర్పంచ్ అజార్, పంచాయతీ కార్యదర్శి వినోద్, ఐకేపీ సీసీ సంతోష్, వార్డు సభ్యులు,మహిళలు పాల్గొన్నారు.