
నార్నూర్, అక్టోబర్ 5 : మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన లంబాడాలు ఇక్కడ ఎస్టీలుగా చెలామణి అవుతున్నారని, పోడు భూముల సమ స్య పరిష్కరిస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించడం హర్షనీయమని తుడుం దెబ్బ సం ఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. గాదిగూ డ, నార్నూర్ మండల కేంద్రాల్లో ఆదివాసీ హక్కు ల పోరాట సమితి (తుడుం దెబ్బ) మండల కమి టీ ఆధ్వర్యంలో మంగళవారం సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. అసెంబ్లీ సాక్షిగా వలస లంబాడాలపై సీఎం మాట్లాడడం సంతో షంగా ఉందని తెలిపారు. తుడుం దెబ్బ జిల్లా ఉపాధ్యక్షుడు మెస్రం మానిక్రావ్, జిల్లా సహాయ కార్యదర్శి తోడసం నాగోరావ్, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు పెందోర్ దాదిరావ్, మండల గౌరవాధ్యక్షుడు మడావి మాన్కు, జిల్లా ప్రధాన కార్యదర్శి పెందోర్ విఠల్, నాయకులు సుర్పం నాగోరావ్, రాయిసిడం యేత్మారావ్, మడావి ఆనంద్రావ్, బలన్పూర్ సార్మేడి కుంమ్ర మాన్కు, మడావి చంద్రహరి, పెందోర్ భారత్, లక్ష్మణ్, నైతం భీంరావ్, కనక అశోక్, పెందోర్ సంతోశ్, ఆడా శ్రీరామ్,మడావి సాగర్, పూసం మధుకర్, బొజ్జుపటేల్, గెడాం మోహన్, పూసం బాదిరావ్, కుడ్మెత గజేందర్, కోట్నాక్ సక్కారా మ్, మాజీ ఎంపీటీసీ తుక్కుబాయి ఉన్నారు.
బజార్హత్నూర్లో..
బజార్హత్నూర్ అక్టోబర్ 5 : మండల కేంద్రంలో తుడుందెబ్బ నాయకుల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వ హించారు. ఈసందర్భంగా మండల తుడుందెబ్బ అధ్యక్షులు పర్చ సాయన్న, నాయకులు చాకటి మహేశ్, నైతం రమేశ్, సుదర్శన్, బాపురావు, మారుతి, సోనేరావు, తదితరులు పాల్గొన్నారు.
జైనథ్లో..
జైనథ్, సెప్టెంబర్ 5 : మండల కేంద్రంలో ఆది వాసీ సంఘాల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదివాసీల సంక్షేమానికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని పేర్కొ న్నారు. ఆదివాసీ నాయకులు పెందోర్ మోహన్, పెందోర్ భరత్, గేడం జగన్నాథ్, కుమ్ర ఆనంద్రా వు, పలువురు నాయకులు పాల్గొన్నారు.