
v
గుడిహత్నూర్,అక్టోబరు 5: సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నారని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కరాడ్ బ్రహ్మానంద్ అన్నారు. గుడిహత్నూర్, సీతాగోంది, వైజాపూర్, శాంతాపూర్, కొల్హారి, తోషం, మన్నూర్ గ్రామాల్లో ఐకేపీ సిబ్బంది, సర్పంచ్ల సమక్షంలో మహిళలకు చీరెలు పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో సర్పంచ్‌లు జాదవ్ సునీత, గిత్తె కల్పన, జీ తిరుమల్‌గౌడ్, మడావి ధనలక్ష్మి, ఎంపీటీసీ కృష్ణవేణి, ఐకేపీ ఏపీఎం ఎన్ భగవాండ్లు, నాయకులు బూర్ల లక్ష్మీనారాయణ, జాదవ్ రమేశ్, లింగంపెల్లి రాజేశ్వర్, జలందర్, సంతోష్‌గౌడ్, పాటిల్ రాందాస్, డీకే సంజయ్, తగరే ప్రకాశ్, రంగు శ్రీనివాస్ గౌడ్, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు.
తాంసి, అక్టోబర్ 5 : మండలంలోని పొన్నారిలో జడ్పీటీసీ తాటిపెల్లి రాజు, తహసీల్దార్ సంధ్యారాణి, ఎంపీడీవో రవీందర్‌తో మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల కన్వీనర్ అరుణ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి రమణ, సర్పంచ్ సంజీవ్‌రెడ్డి, ఎంపీటీసీ రేఖా రఘు, ఉప సర్పంచ్ అశోక్, టీఆర్ఎస్ నాయకులు రమేశ్, మల్లయ్య, గంగన్న, చిన్నయ్య, హరివర్ధన్, చంద్రన్న, దేవేందర్, దయానంద్, ఆనంద్ పాల్గొన్నారు. తాంసిలో సర్పంచ్ కృష్ణ, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు గోవర్ధన్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ గంగారాం, టీఆర్ఎస్ నాయకులు పరమేశ్, శ్రీనివాస్ చీరెలు పంపిణీ చేశారు.
జైనథ్, అక్టోబర్ 5 మండలంలోని సుందరగిరి, మేడిగూడలో మహిళలకు ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్ బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ పురుషోత్తం యాదవ్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు పెందూర్ దేవన్న, ఎంపీడీవో ముత్యంరావు, గ్రామస్తులు పాల్గొన్నారు.
సిరికొండ,అక్టోబర్ 5: మండలంలోని పొన్న గ్రామంలో సర్పంచ్ చంద్రకళ, సోంపల్లి ఎంపీటీసీ సూర్యకాంత్ మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రామపెద్ద మారుతి, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
బజార్హత్నూర్, అక్టోబర్ 5 : మండలకేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. కార్యక్రమంలోఎంపీపీ అజీడే జయశ్రీ, జడ్పీటీసీ మల్లెపూల నర్సయ్య, సర్పంచ్ లావణ్య, తహసీల్దార్ కూన గంగాధర్, బజార్హత్నూర్ పీఏసీఎస్ చైర్మన్ మేకల వెంకన్న, ఐకేపీ ఏపీఎం గణేశ్, మండల కన్వీనర్ రాజారాం, బోథ్ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, నాయకులు డుబ్బుల చంద్రశేఖర్,చట్ల విలాస్, మధుకర్, రియాజ్, జాంసింగ్ పాల్గొన్నారు.
ఇచ్చోడ, అక్టోబర్ 5 : ఇచ్చోడతో పాటు ముక్రా (కే), హీరాపూర్, జల్దా, అడెగామ (బీ), జామిడి, బోరిగామ, కామగిరిలో మంగళవారం పంపిణీ బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ నిమ్మల ప్రీతమ్‌రెడ్డి, టీఆర్ఎస్ మం డల కన్వీనర్ ఏనుగు కృష్ణారెడ్డి, సర్పంచ్‌లు చౌహాన్ సునీత, గాడ్గె మీనాక్ష్మి, గిత్తే జ్యోతి, హరన్ సుభాష్, కదం వనిత, కుంట అరుంధతి, మోనాబాయి, తొడసం భీంరావ్, ఎంపీటీసీ గాడ్గె సుభాష్, ఉప సర్పంచ్ లోక శిరీశ్ రెడ్డి, నాయకులు భాస్కర్, ముస్తాఫా, కరే సురేశ్, నర్వాడే రమేశ్, లతీఫ్, భీముడు, అర్గుల గణేశ్, మహేశ్, సాబీర్, మహిళలు పాల్గొన్నారు.