
జిల్లాలో మిలియన్ మొక్కలు నాటాం
నా జన్మధన్యమైంది
మొక్కలసంరక్షణకు ప్రత్యేక కమిటీలు
ఎమ్మెల్యే జోగు రామన్న
ఆదిలాబాద్ రూరల్, జూలై 5 : తన పుట్టిన రోజు సందర్భంగా పెద్ద సంఖ్య లో మొక్కలు నాటే కార్యక్రమా న్ని విజయవంతం చేసిన ఆదిలాబాద్ జిల్లా ప్రజల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిదని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నా రు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన మా ట్లాడారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా జిల్లాలో మొత్తం 10.45 లక్ష ల మొక్కలు నాటినట్లు చెప్పారు. దుర్గానగర్తో పాటు జిల్లాలోని వివిధ ప్రాం తాలు, ఇంటింటా ప్రజలు మొక్క లు నాటి తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారన్నారు. అటవీశాఖ, డీఆర్డీఏ, ఇతర శాఖల అధికారులు ఈ కార్యక్రమానికి ఎంతగానో సహకరించారని తెలిపారు. తన విన్నపం మేరకు ఉద్యో గ, కుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థ లు, మహిళా సంఘాలు, యువకులందరూ స్వచ్ఛందంగా పాల్గొన్నారని చెప్పారు. ఇంత స్పందన వస్తుందని ఊహించలేదని, తన జన్మ ధన్యమైందన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.నాటిన మొక్క ల రక్షణకు కౌన్సిలర్లు, ఇతరులతో కలిసి 7 కమిటీలు ఏర్పాటు చేసినట్లు చెప్పా రు. విడుతల వారీగా కమిటీల సభ్యులు రోజూ దుర్గానగర్ అటవీ ప్రాంతంలో పర్యటిస్తూ మొక్కలను సంరక్షిస్తారని తెలిపారు. సమావేశంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, జైనథ్ ఎంపీపీ గోవర్ధన్, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, టీఆర్ఎస్ నాయకులు రౌత్ మనోహర్, వెంకట్రెడ్డి, యూనిస్ అక్బానీ, బండారి సతీశ్, అజయ్ ఉన్నారు.