
జాబితా విడుదల చేసిన ఎన్నికల కమిషన్
నిర్మల్ జిల్లాలో అత్యధికంగా 6,75,784 మంది ఓటర్లు
ఆసిఫాబాద్ జిల్లాలో అత్యల్పంగా 4,11,951 మంది
2808 పోలింగ్ కేంద్రాలు
ఆదిలాబాద్, జనవరి 5 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితాను విడుదల చేసింది. నవంబరు ఒకటి నుంచి చేరికలు, మార్పులు, చేర్పులు చేపట్టగా, రెండు నెలల్లో ప్రక్రియ పూర్తి చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 21,06,626 మంది ఓటర్లు ఉన్నట్లు ప్రకటించింది. నిర్మల్ జిల్లాలో అత్యధికంగా 6,75,784 మంది ఓటర్లు ఉండగా, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో తక్కువగా 4,11,951 మంది ఉన్నట్లు లెక్క తేల్చింది.
రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితాను విడుదల చేసింది. నవంబరు 1 నుంచి ఓటరు జాబితాలో చేరికలు, మార్పులు, చేర్పులు చేపట్టింది. రెండు నెలలపాటు ఈ ప్రక్రియ కొనసాగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2808 పోలింగ్ స్టేషన్లు ఉండగా, 21,06,626 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల అధికారులు గుర్తించారు. నవంబరు 1న డ్రాఫ్ట్ ఓటరు జాబితాను విడుదల చేసి రెండు నెలల పాటు కొత్తగా ఓటర్లు చేరడంతో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారిని గుర్తించి మార్పులు, చేర్పులు చేపట్టారు.
జిల్లాల వారీగా..
ఆదిలాబాద్ జిల్లాలో 582 పోలింగ్ స్టేషన్లు ఉండగా 4,25,042 మంది ఓటర్లు ఉ న్నారు. వీరిలో 2,09,071 పురుషులు, 2, 15,961 మంది మహిళా ఓటర్లు, థర్డ్ జండ ర్లు 10 మంది ఉన్నారు . నిర్మల్ జిల్లాలో 916 పోలింగ్ స్టేషన్లు ఉండగా 6,75,784 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 3, 27,115 మంది, మహిళలు 3,48,624, థర్డ్ జండర్లు 45 మంది ఉన్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 584 పోలింగ్ కేంద్రాలు ఉండగా మొత్తం 4,11,951 మంది ఓటర్లు ఉ న్నారు. వీరిలో 2,06,908 మంది పురుషు లు, 2,05,024 మంది మహిళా ఓటర్లు, 19 మంది థర్డ్ జండర్లున్నారు. మంచిర్యాల జిల్లా లో 726 పోలింగ్ స్టేషన్లు ఉండగా 5,93,849 మంది ఓటర్లున్నారు. వీరిలో 2,97, 912 మంది పురుషులు, 2,95,891 మంది మహిళలు, థర్డ్ జండర్ 46 మంది ఉన్నారు.