
బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్
ఇచ్చోడ, జనవరి 5 : రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్న దని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పేర్కొన్నా రు. ఇచ్చోడలోని తహసీల్ కార్యాలయంలో లబ్ధి దారులకు బుధవారం కల్యాణలక్ష్మి, షాదీ ముబా రక్, ఎస్సీ కార్పొరేషన్, సీఎం రిలీఫ్ ఫండ్, దండా రీ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత పాలకులు సంక్షేమాన్ని విస్మరించారని మండిపడ్డారు. ఐటీడీఏ చైర్మన్ కనక లక్కేరావ్, ఎంపీపీ నిమ్మల ప్రీతమ్ రెడ్డి, మండల కన్వీనర్ ఏనుగు కృష్ణా రెడ్డి, సర్పంచ్‌లు చౌహాన్ సునీత, కల్లెం అనిత, హారన్ సుభాష్, ఎంపీటీసీలు నిమ్మల శివ కుమార్ రెడ్డి, గాడ్గె సుభాష్, జాహేద్, లోక శీరీష్ రెడ్డి, ఎస్సీ కార్పొ రేషన్ ఈడీ దుర్గం శంకర్, ఏటీడీవో సౌజన్య, తహసీల్దార్ అతిఖొద్దీన్, డిప్యూటీ తహసీల్దార్ జాదవ్ రామారావ్, నాయకులు పాల్గొన్నారు.
ప్రజల సంతోషమే ప్రభుత్వ ధ్యేయం
గుడిహత్నూర్, జనవరి 5 : ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రభుత్వం అనేక సంక్షే మ పథకాలు అమలు చేస్తున్నదని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పేర్కొన్నారు. మాన్కాపూర్ గ్రామంలో ఐటీడీఏ చైర్మన్ లక్కేరావ్తో కలిసి ఎమ్మెల్యే బుధవారం లబ్ధిదారులకు దండారీ చెక్కులను అందజేశారు. తహసీల్ కార్యాలయం లో 8 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల ను ఎమ్మెల్యే అందజేశారు. తహసీల్దార్ పవన్ చంద్ర, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కరాడ్ బ్రహ్మనంద్, రైతు బంధు సమితి మండల అధ్య క్షుడు బూర్ల లక్ష్మీనారాయణ, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుడు ఎస్కే జమీర్, ఎంపీడీవో సునీ త, నాయకులు లింగంపెల్లి రాజేశ్వర్, సంగ ఆశ న్న యాదవ్, జాదవ్ రమేశ్, సంతోష్‌గౌడ్, పాటిల్ రాందాస్, జంగు, సర్పంచ్‌లు, ఎంపీటీ సీలు, ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేను కలిసి పాండుగూడ గ్రామస్తులు
సిరికొండ, జనవరి 5 : మండలంలోని పాండు గూడకు చెందిన గ్రామస్తులు, పటేళ్లు, టీఆర్ఎస్ మండల ప్రతినిధి లక్ష్మణ్‌రావ్ బుధవారం జిల్లా కేంద్రంలోని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్‌ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అం దించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలి పారు. కుమ్రం భీంరావ్, జంగుబాపు, కోసేరావ్, ఆనంద్ రావ్, తదితరులు పాల్గొన్నారు.