
రికార్డుస్థాయిలో క్వింటాలు ధర
కుమ్రం భీం ఆసిఫాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ);కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పత్తికి రికార్డు స్థాయిలో ధర పలికింది. సీసీఐ మద్దతు ధర క్వింటాలుకు రూ. 6025 ఉండగా, బుధవారం వ్యాపారులు రూ. 9,999 చెల్లించారు. ఇక ఇచ్చోడ మార్కెట్లో రూ. 9800, భైంసా, కుభీర్లలో రూ. 9,600లకు కొనుగోలు చేశారు. అకాల వర్షాలు, చీడపీడల కారణంగా ఈ ఏడాది దిగుబడి తగ్గగా, ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం దూది ధర బంగారాన్ని తలపిస్తుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రైతుబంధు సాయం రైతులకు ముందుగానే సంక్రాంతి పండుగను తీసుకువచ్చింది. సాగు సాఫీగా సాగేందుకు పెట్టుబడి సాయం ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు తెలుపుతూ రైతులు సీఎం చిత్రపటానికి పంటాభిషేకాలు చేస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తులతో ‘రైతుబంధు’ అక్షరమాలను ఏర్పాటు చేసి జై కేసీఆర్ అని నినాదాలు చేస్తూ సంబురాలు చేసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నరైతు బంధు వారోత్సవాలచిత్రమాలిక..