
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్
ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ
బేల, జనవరి 5 : పేదింటి ఆడబిడ్డలకు ఆసరాగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలు అమలు చేస్తున్నదని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్ పేర్కొన్నారు. మండల కేంద్రంతో పాటు మండలంలోని కొబ్బాయి, చప్రాల , కాప్సి గ్రామాల్లో బుధవారం ఇంటింటికీ వెళ్లి 11 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు ఈ పథకం ఎంతగానో తోడ్పడుతుందని తెలిపారు.
సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ
కొబ్బాయి గ్రామంలో ఎస్డీఎఫ్ నిధుల నుంచి రూ. 5 లక్షలతో చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్ భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయడంతో మండలంలోని అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు పూర్తవుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు గంభీర్ ఠాక్రే, నాయకులు ప్రమోద్ రెడ్డి, జక్కుల మధుకర్, సతీశ్ పవార్, మంగేశ్ ఠాక్రే, సంతోష్ బెదుడ్కర్, వాడ్కర్ తేజ్రావ్, తన్వీర్ఖాన్, మనోజ్, తహసీల్దార్ బడాల రాంరెడ్డి, ఎంపీడీవో భగత్ రవీందర్, తదితరులు పాల్గొన్నారు.
చరిత్ర సృష్టించిన రైతుబంధు
రైతు బంధు పథకం చరిత్ర సృష్టించిందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్ అన్నారు. రైతు బంధు వారోత్సవాల్లో భాగంగా కోగ్దూర్ గ్రామంలోని రైతువేదికలో సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చి నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఎడారిగా మారిన తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మించి సస్యశ్యామలం చేశారని, వేసవిలో చెరువులు జలకళతో ఉట్టిపడుతున్నాయన్నారు. కార్యక్రమంలోనాయకులు, రైతులు పాల్గొన్నారు.