యైటింక్లయిన్ కాలనీ / శ్రీరాంపూర్ /మందమర్రి రూరల్, అక్టోబర్ 4 : సింగరేణి సంస్థ సీఅండ్ఎండీ ఎన్.శ్రీధర్ సోమవారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్ నుంచి సింగరేణి వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియాల జీఎంలతో ఉత్పత్తి, ఉత్పాదకత, బొగ్గు రవాణాపై సోమవారం సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్‌లో సాధించిన ఉత్పత్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తి, రవాణా, ఓబీ తొలగింపు, సీహెచ్పీల పనితీరు, బొగ్గు గనుల్లో పని స్థలాల పెంపు, ఓసీ ప్రాజెక్టుల్లో యంత్రాల పనితీరు తదితర అంశాలపై చర్చించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆర్జీ-2 జీఎం టీ వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ గత నెలలో డివిజన్లో 111శాతం ఉత్పత్తి సాధించినట్లు తెలిపారు. వకీలుపల్లి గనిలో కంటిన్యూయస్ మైనర్ యంత్రాన్ని ప్రవేశపెట్టి ఉత్పత్తిని వెలికి తీస్తున్నట్లు పేర్కొన్నారు. డివిజన్లో ఉత్పత్తి లక్ష్య సాధనకు ముందస్తు ప్రణాళికలు చేపట్టి ముందుకు సాగుతున్నామని తెలిపారు. సింగరేణి భవన్ నుంచి డైరెక్టర్ (ఆపరేషన్) ఎస్ చంద్రశేఖర్, డైరెక్టర్ (ఈఆండ్ఎం) డీ సత్యనారాయణ, డైరెక్టర్ (పైనాన్స్, పా, పీపీ) ఎన్ బలరాం, అడ్వైజర్ (మైనింగ్) డీఎన్ ప్రసాద్, అడ్వైజరీ (ఫారెస్ట్రీ) సురేంద్రపాండే, ఈడీ (కోల్‌మూమెంట్) జే అల్విన్, జీఎం (కోఆర్డినేషన్) కే సూర్యనారాయణ, జీఎం (మార్కెటింగ్) కే రవిశంకర్, ఆర్జీ-2 ఏరియా నుంచి ఎస్వోటూ జీఎం సాంబయ్య, ఏరియా ఇంజినీర్ రాధాకృష్ణా రావు, ఓసీపీ-3 పీవో మోహన్‌రెడ్డి, వర్క్‌షాప్ డీజీఎం ఎర్రన్న, సీహెచ్‌పీ ఎస్ఈ సదానందం, క్వాలిటీ డిప్యూటీ మేనేజర్ వెంకటమోహన్, ఐటీ మేనేజర్ సుబ్రహ్మణ్యం, శ్రీరాంపూర్ ఏరియా నుంచి జీఎం సురేశ్, పీవోలు పురుషోత్తంరెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి, ఈఈ కుమార్, ఎస్వోటూజీఎం కే హరినారాయణగుప్తా, ఏజెంట్లు విజయభాస్కర్‌రెడ్డి, ఏవీ రెడ్డి, డీవైజీఎం చిరంజీవులు, మందమర్రి ఏరియా జీఎం చిం తల శ్రీనివాస్, ఎస్వోటూ జీఎం గోపాల్ సింగ్, శాంతిఖని ఏజీఎం ప్రాజెక్టు అధికారి వెంకటేశ్వర్లు, ఏజెంట్ రాంచందర్, కేకే ఓసీ ప్రాజెక్టు అధికారి రమేశ్, ఆర్కేపీ ఓసీ ప్రాజెక్టు అధికారి మధుసూదన్, కాసిపేట ఏజెంట్ రాజేందర్, ఎస్ఈ ఐఈడీ ఫణికుమార్ పాల్గొన్నారు.