
దస్తురాబాద్, అక్టోబర్4 : పోడు భూముల సమస్య పరిష్కరిస్తానని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో పేర్కొనడంతో మండలంలోని మున్యాల గోండు గూడెం ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ ) మండల కమిటీ ఆధ్వర్యం లో ముఖ్యమంత్రి చిత్ర పటానికి సోమవారం పాలాభిషేకం చేశారు. సీఎం ప్రకటనపై కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో తుడుం దెబ్బ మండల అధ్యక్షుడు మ్సైం సురేందర్, ప్రధాన కార్యదర్శి తొడసం కిరణ్ కుమార్, నాయకులు ఆదివాసీ గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
ఎదులాపురం,అక్టోబర్4: మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన లంబాడాలు ఇక్కడ ఎస్టీలుగా చెలామణి అవుతున్నారని స్వయంగా సీఎం కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడారని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ ఆదిలాబాద్ జిల్లా కమిటీ అధ్యక్షుడు గోడం గణేశ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని కుమ్రం భీమ్ చౌరస్తా వద్ద తుడుం దెబ్బ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ తరఫున ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర కార్యదర్శి కొడప నగేశ్, జిల్లా ఉపాధ్యక్షుడు కుమ్ర శ్యాంరావు, ప్రచార కార్యదర్శి వెట్టి మనోజ్, జిల్లా కోశాధికారి మరప భారత్, నాయకులు తొడసం మనోహర్, ఆత్రం భర్తబ్, చకహాటీ సునీల్, సిడం పురుషోత్తం,జంగల పోచ్చన్న, గోవింద్, గంగాధర్, గణపథ్, సంతాబాయి, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ రూరల్, అక్టోబర్ 4: గిరిజనులకు జరుగుతున్న అన్యాయంపై సీఎం కేసీఆర్ మాట్లాడడంతో జిల్లా ఆదివాసీ సంఘం నాయకులు హర్షం ప్రకటించారు.మ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కొలాం నాయకుడు కొడప సోనేరావ్, ఎంపీటీసీ జంగు పటేల్, నాయకులు నైతం శుక్లాల్, సోము, కుమ్రరాజు, మోతేరావ్, గేడం రాము పాల్గొన్నారు.