
తాంసి, అక్టోబర్ 4 : మండలంలోని జామిడి, కప్పర్ల, బండల నాగాపూర్‌లో సోమవారం బతుకమ్మ చీరెలు పంపి ణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు కేశవ్‌రెడ్డి, వెంకన్న, సదానందం, ఏపీఎం రవీందర్, నాయకులు పాల్గొన్నారు.
జైనథ్, అక్టోబర్ 4: మండలంలోని లక్ష్మీపూర్లోజడ్పీటీసీ తుమ్మల అరుంధతి మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. బతుకమ్మ కానుకగా సీఎం కేసీఆర్ ఆడబిడ్డలకు చీరెలు పంపిణీ చేస్తున్నారని తెలిపారు.
నార్నూర్,అక్టోబర్4: మండలంలోని మాన్కాపూర్లో సర్పంచ్ రాథోడ్ సావీందర్ అధ్యక్షతన సోమవారం బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. నాగల్కొండ,తాడిహత్నూర్‌లో కూడా చీరెలు పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో ఆర్అండ్బీ డీఈ డీ రమేశ్, ఇంద్రవెల్లి మార్కెటింగ్ కమిటీ వైస్ చైర్మన్ తొడసం నాగోరావ్, ఐకేపీ ఏపీఎం రమేశ్, నాగల్కొండ సర్పంచ్ జాదవ్ సునీత, ఎంపీటీసీ అభితాఖానామ్, ఉప సర్పంచ్‌లు రాయిసిడాం రూప్‌దేవ్, అజార్, మాజీ ఎంపీపీ మెస్రం రూప్‌దేవ్, సీసీలు శ్రీరామ్, సంతోష్, మొబిలైజర్ శారద, మహిళలు ఉన్నారు.
సిరికొండ, అక్టోబర్ 4: మండల కేంద్రంతో పాటు సోంపల్లి గ్రామంలో మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ పెందూర్ అమృత్ రావ్, సర్పంచ్ శకుంతల, నర్మద, తహసీల్దార్ సర్ఫరాజ్ ఎంపీడీవో సురేశ్, సంతోష్, టీఆర్ఎస్ కన్వీనర్ బాలాజీ, ఆర్ఐ యుజ్వేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ రాజన్న, ఐకేపీ సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు.
తలమడుగు, అక్టోబర్ 4 : మండలంలోని కజ్జర్ల రైతువేదికలో సోమవారం బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కల్యాణం లక్ష్మి, జడ్పీటీసీ గోక గణేశ్ రెడ్డి, సర్పంచ్ మోట్టే వెంకటమ్మ, తహసీల్దార్ ఇమ్రాన్‌ఖాన్, ఎంపీడీవో రమాకాంత్, టీఆర్ఎస్ మండల కన్వీనర్ తోట వెంకటేశ్, రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్ గోక జీవన్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు వెల్మ శ్రీనివాస్ రెడ్డి, మోట్టే కిరణ్ పాల్గొన్నారు.
నేటి నుంచి బతుకమ్మ చీరెల పంపిణీ
గుడిహత్నూర్,అక్టోబర్ 4: మండలంలో ఈ నెల 5 నుంచి 9వరకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేయనున్నట్లు ఐకేపీ ఏపీఎం ఎన్ భగవాండ్లు తెలిపారు. మండలంలోని 26 పంచాయతీలకు మొత్తం 11,578 చీరెలు వచ్చాయని పేర్కొన్నారు.
భీంపూర్, అక్టోబర్ 4: భీంపూర్, బేల్సరిరాంపూర్ , అందర్‌బంద్ తదితర గ్రామాల్లో మంగళవారం నుంచి బతుకమ్మ చీరెలు పంపిణీ చేయనున్నట్లు సర్పంచ్‌లు మడావి లింబాజీ ,చిన్ను, పెండెపు కృష్ణయాదవ్ తెలిపారు. లబ్ధిదారులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ చీరెలు తీసుకోవాలని సూచించారు.