
ఆదిలాబాద్ రూరల్, జనవరి 4 : రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్ పేర్కొన్నారు. రైతుబంధు సంబురాల్లో భాగంగా మంగళవారం మండలంలోని అంకోలి గ్రామంలో టీఆర్ఎస్ నాయకులు ర్యాలీ తీశారు. అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే రైతుల గురించి ఆలోచిస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ అన్నారు. రైతు బంధు కింద రూ.50వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసిందని తెలిపారు. 70ఏళ్ల కాంగ్రెస్, బీజేపీ పాలనలో ఏనాడు రైతుల గురించి ఆలోచించలేదన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మి, నాయకులు జగదీశ్, నరేశ్, భూమన్న, సోనేరావ్ పాల్గొన్నారు.
రైతు బాంధవుడు కేసీఆర్
బోథ్, జనవరి 4 : రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ అని ధన్నూర్(బీ) ఎంపీటీసీ నారాయణరెడ్డి, సర్పంచ్ గంగాధర్ అన్నారు. మండలంలోని ధన్నూర్(బీ) గ్రామ పంచాయతీ ఆవరణలో రైతులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ఎన్ జగన్మోహన్రెడ్డి, గడ్డం ప్రకాశ్‌రెడ్డి, రవీందర్ పాల్గొన్నారు.
రుయ్యాడిలో..
తలమడుగు, జనవరి 4 : అన్నదాతలకు రైతు బంధు పథకం ద్వారా నగదు పంపిణీ చేసిన సందర్భంగా మండలంలోని రుయ్యాడి గ్రామంలో టీఆర్ఎస్ నాయకులు సంబురాలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలభిషేకం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన, ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ మండల కన్వీనర్ తోట వెంకటేశ్ మాట్లాడూతూ మండలంలో 10 రోజుల పాటు రైతు బంధు సంబురాలను గ్రామాల వారీగా నిర్వహిస్తామని తెలిపారు. రైతుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ పోతారెడ్డి, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు జీవన్‌రెడ్డి, నాయకులు కిరణ్, మల్లేశ్, గంగాధర్, వెంకట్‌రెడ్డి, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.
ఇంద్రవెల్లిలో..
ఇంద్రవెల్లి, జనవరి 4 : అన్నదాతల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకం ప్రవేశపెట్టిందని పీఏసీఎస్ చైర్మన్ మారుతి పటేల్ డోంగ్రే అన్నారు. రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంకు ఎదుట టీఆర్ఎస్ నాయకులు, రైతులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. జై కేసీఆర్.. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు మహ్మద్ అబ్దుల్ అమ్జద్, ఎంపీటీసీ కోవ రాజేశ్వర్, ఇంద్రవెల్లి ఉపసర్పంచ్ గణేశ్టేహేరే, టీఆర్ఎస్ మండల నాయకులు దేవ్‌పూజే మారుతి, శివాజీ, బాబుముండే, శ్రీనివాస్, రాందాస్, కనక హనుమంత్‌రావ్, బాల్సింగ్, నగేశ్, సుంకట్రావ్, హరిదాస్, ఆత్రం ధర్ము, నవాబ్బేగ్, తదితరులు పాల్గొన్నారు.
ఆదివాసీ రైతుల సంబురాలు
ఉట్నూర్ రూరల్, జనవరి 4 : ఉట్నూర్ మండలం దోంగచింత గ్రామంలో ఆదివాసీ రైతులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మర్సుకోల తిరుపతి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదివాసుల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. ప్రతి అన్నదాతకు రైతు బంధు పథకం ద్వారా నేరుగా డబ్బులు అందిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ గ్రామ పటేల్ జుగాదిరావ్, సుందర్, మహిళా రైతులు జంగుబాయి, పారుబాయి, ఈశ్వరీబాయి, మోతీరాం పాల్గొన్నారు.
జైనథ్, జనవరి 4 : రాష్ట్రంలో రైతు బంధు, రైతు బీమా, ఇతర పథకాలు సమర్థవంతంగా అమలవుతున్నాయని రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి అన్నారు. జైనథ్ మండలం గిమ్మ గ్రామంలో రైతులతో కలిసి సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. డప్పువాయిద్యాలతో గ్రామంలో ర్యాలీ తీసి పటాకులు కాల్చి రైతు బంధు సంబురాలు నిర్వహించారు. అనంతరం ఆరుగురు లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్, వైస్‌ఎంపీపీ విజయ్, పీఏసీఎస్ చైర్మన్లు గోవర్ధన్‌రెడ్డి , పురుషోత్తంయాదవ్, డైరెక్టర్ చంద్రయ్య, ఏనుగు అశోక్‌రెడ్డి, నాయకులు పరమేశ్వర్, ప్రభాకర్, ఆశన్న పాల్గొన్నారు.