
ముథోల్, జనవరి 4 : స్వచ్ఛసర్వేక్షణ్ గ్రామీణ-2021 కార్యక్రమంలో భాగంగా నిర్మల్ జిల్లాలోని ఆయా గ్రామాల్లో మంగళవారం కేంద్ర బృందం సభ్యులు పర్యటించారు. ముథోల్ మండల కేంద్రంలోని 16 కాలనీల్లోని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, ఉపయోగం, సీసీ రోడ్లు, పారిశుధ్య నివారణకు చేపట్టిన చర్యలను సభ్యులు కిశోర్, రాకేశ్ పరిశీలించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. ముందుగా వారికి పంచాయతీ తరఫున స్వాగతం పలికారు. వీరి వెంట సర్పంచ్ రాజేందర్, ఎంపీడీవో సురేశ్‌బాబు, పంచాయతీ ఈవో పవన్, జూనియర్ అసిస్టెంట్ రాహుల్ తదితరులు ఉన్నారు.
పరిమండల్‌లో..
మామడ, జనవరి 4 : మామడ మండలంలోని పరిమండల్ గ్రామంలో కేంద్ర బృందం సభ్యుడు సంతోష్‌కుమార్ పర్యటించారు. మరుగుదొడ్లు, ఇంకుడుగుంతలు, కిచెన్ గార్డెన్, రోడ్లు, మురుగుకాలువలతో పాటు కేంద్ర పథకాల తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించారు. వారి వెంట సర్పంచ్ బొచ్చు నాగమణి, ఎంపీడీవో మల్లేశం, ఎంపీవో కలీం, ఈజీఎస్ ఏపీవో శివాజీ, పంచాయతీ కార్యదర్శి రవి, ఈసీ సంజీవ్, టీఏ కరీం, నాయకులు జైసింగ్, కైలాస్, అన్వర్ తదితరులు పాల్గొన్నారు.
రాయదారిలో..
పెంబి, జనవరి 4 : మండలంలోని రాయదారి గ్రామంలోని పంచాయతీ కార్యాలయంలో వసతులు, వ్యక్తిగత మరుగుదొడ్లు, అంగన్వాడీ కేంద్రాలు, సెగ్రిగేషన్ షెడ్డు, పాఠశాల భవనాన్ని బృందం సభ్యులు సునీల్ గౌడ్, అబ్జహర్ పరిశీలించారు. మరుగుదొడ్లు నిర్మించుకున్న కొందరికి బిల్లులు రాలేదని లబ్ధిదారులు వారి దృష్టికి తీసుకెళ్లారు. వారి వెంట ఎంపీడీవో లింబాద్రి, ఎంపీవో చిక్యాల రత్నాకర్ రావు, ఏపీఎం గంగారెడ్డి, ఏపీవో రమేశ్, సర్పంచ్ మహేందర్, పంచాయతీ కార్యదర్శి తదితరులు ఉన్నారు.