
బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాఫురావ్
అభివృద్ధి పనులు ప్రారంభం
నేరడిగొండ, జనవరి 4 : తెలంగాణ సర్కారు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్నదని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. మండలంలోని బోందిడి పంచాయతీ కార్యాలయం, వైకుంఠధామాన్ని మంగళవారం ఆయ న ప్రారంభించారు. అలాగే సుర్దాపూర్, రేంగన్వాడీ రోడ్డు పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఏ సర్కా రూ అమలుచేయని సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్నదన్నారు. ఎంపీ పీ రాథోడ్ సజన్, బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ దావుల భోజన్న, సర్పంచ్ ఆడె అనిత, టీఆర్ఎస్ మండల కన్వీనర్ అల్లూరి శివారెడ్డి, వైస్ ఎంపీపీ మహేందర్‌రెడ్డి, బుగ్గారం(కే) సర్పంచ్ సుభాష్, ఎంపీడీవో అబ్దుల్సమద్, నాయకులు చంద్రశేఖర్‌యాదవ్, ఆడె జనార్దన్, సుభాష్, శ్రీనివాస్‌రెడ్డి, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
సాంఘిక సంక్షేమ పాఠశాల సందర్శన..
ఇచ్చోడ, జనవరి 4 : ఇచ్చోడ సాంఘిక సంక్షే మ మహాత్మా జ్యోతిబా ఫూలే బాలుర పాఠశాలను ఎమ్మెల్యే ఆకస్మికంగా సందర్శించారు. తరగతి గదులు, ఆహార మెనూ పట్టిక రికార్డులను పరిశీలించారు. పేద కుటుంబాల్లోని విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటు చేసిందన్నారు. నర్సాపూర్‌లో మహాత్మా జ్యోతి బా ఫూలే పాఠశాల భవనం మంజూరుచేసిందని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని చెప్పారు. టీఆర్ఎస్ మండల కన్వీనర్ ఏను గు కృష్ణారెడ్డి, ఎంపీపీ నిమ్మల ప్రీతమ్ రెడ్డి, స ర్పంచ్ సునీత, ఆత్మ చైర్మన్ నరాల రవీందర్, ఎంపీటీసీ నిమ్మల శివకుమార్‌రెడ్డి, ఉప సర్పంచ్ లోక శిరీశ్‌రెడ్డి, ఆర్సీవో రాథోడ్ గోపిచంద్, ప్రిన్సిపాల్ విలాస్, నాయకులు వెంకటేశ్, దాసరి భాస్కర్, అబ్దుల్ రషీద్, ముస్తఫా, గణేశ్, ప్రవీణ్, నర్వాడే రమేశ్, శ్రీహరి, లతీఫ్, విద్యార్థులు పాల్గొన్నారు.
దండారీ చెక్కుల అందజేత..
బోథ్, జనవరి 4 : మండలంలోని 17 ఆదివాసీ గిరిజన గ్రామాలకు దండారీ ఉత్సవాలకు సంబంధించిన రూ.1.70 లక్షల చెక్కులను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాథోడ్ బాపురావ్ అందజేశారు. జడ్పీటీసీ ఆర్ సంధ్యారాణి, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు తాహెర్బిన్సలాం, కన్వీనర్ ఎస్ రుక్మాణ్‌సింగ్, సర్పంచ్ సురేందర్‌యాదవ్, దావుల భోజన్న, మెస్రం భూమన్న, చట్ల ఉమేశ్, ఎం సుభాష్, ఎలుక రాజు, బీరం రవియాదవ్, ఏటీడీవో సౌజన్య పాల్గొన్నారు.