
మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
నిర్మల్‌లో వాహనం ప్రారంభం
నిర్మల్ అర్బన్, జనవరి 4 : పిలలకు ఆపద వస్తే ఆదుకునేందుకు బాలరక్షక్ వాహనం ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. నిర్మల్‌లోని క్యాం ప్ కార్యాలయంలో మంగళవారం మున్సిపల్ చై ర్మన్ గండ్రత్ ఈశ్వర్, డీడబ్ల్యూవో విజయలక్ష్మితో కలిసి బాల రక్షక్ వాహనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బాలలను ఆదుకునేందుకు తెలంగాణ సర్కారు రాష్ట్రంలోని 33 జిల్లాలకు ఒక్కోటి చొప్పున ప్రత్యేకంగా బాలరక్షక్ వాహనాలను కేటాయించిందన్నారు. 1098 నంబర్‌కు ఫోన్ చేస్తే వాహనం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారన్నారు. రాష్ట్రంలో అనాథలనే వారు ఉండకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వమే తల్లీదండ్రిగా మారి అనేక కార్యక్రమాలు చేపడుతున్నదన్నారు.
నర్సాపూర్(జీ) కేజీబీవీ సందర్శన..
నిర్మల్ టౌన్, జనవరి 4 : నర్సాపూర్ (జీ) కేజీబీవీని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీతో కలిసి మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా వారికి విద్యార్థులు పుష్పగుచ్ఛం అందించి, స్వాగతం పలికారు. పాఠశాలలో విద్యా బోధన, కరోనా నేపథ్యంలో తీసుకుంటున్న జాగ్రత్తలు, మెనూ ప్రకారం భోజనం తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. పంచాయతీ వర్కర్లకు వేతనాలు పెంచి, సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆ సంఘ నాయకులు మంత్రికి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, నాయకులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పథకాలపై ప్రచారం చేయాలి..
సోన్, జనవరి 4 : ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన పెంచేలా ప్రచారం చేపట్టాలని డీపీఆర్వో ఉమారాణికి మంత్రి సూచించారు. తన నివాసంలో డీపీఆర్వోతో పాటు సిబ్బంది మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. అమలవుతున్న పథకాల గురించి డీపీఆర్వోను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట సిబ్బంది తిరుమల, విష్ణు తదితరులు ఉన్నారు.