
ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి
కుంటాల, నవంబర్ 3 : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు. కుంటాల మండల కేంద్రంలో బుధవారం ఆయన పర్యటించారు. సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభు త్వం రైతును రాజు చేయడమే లక్ష్యంగా అనేక పథకాలు ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు. కుంటాల మండలంలో కాళేశ్వరం 27 ప్యాకేజీ పనులు పూర్తయ్యేలా చర్య లు తీసుకుంటానన్నారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న రహదారుల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.
కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
స్థానిక రైతు వేదికలో 86 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అందజేశారు. కుంటాలలో రూర్బన్ పథకం ద్వారా ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్‌ను ప్రారంభించారు. సర్పంచ్ డీ సమత, ఎం పీపీ గజ్జారాం, జడ్పీటీసీ గంగామణి, సొసైటీ చైర్మన్ సట్ల గజ్జారాం, ఆత్మ చైర్మన్ సవ్వి అశోక్ రెడ్డి, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు ముజిగే ప్రవీ ణ్, టీఆర్ఎస్ కన్వీనర్ పడకంటి దత్తు, తహసీల్దార్ శ్రీధర్, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, పార్టీ కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.
అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి
ముథోల్, నవంబర్ 3 : అన్ని వర్గాల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. ముథోల్ తహసీల్ కార్యాలయంలో బుధవారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వ మే కొనుగోలు చేస్తుందని తెలిపారు. మండలాధ్యక్షుడు అఫ్రోజ్ ఖాన్, సర్పంచ్ రాజేందర్, నాయకులు మగ్దూమ్, సూర్యం రెడ్డి, తహసీల్దార్ శివప్రసాద్ పాల్గొన్నారు.