ఇల్లెందు, అక్టోబర్ 3 : ప్రమాదాల నుంచి రక్షించుకోవాలంటే వ్యక్తిగత రక్షణ ముఖ్యమని జీఎం సేఫ్టీ గురువయ్య అన్నారు. సింగరేణి ఇల్లెందు క్లబ్లో ఏరియా జీఎం మల్లెల సుబ్బారావు ఆధ్వర్యంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గురువయ్య మాట్లాడుతూ.. గనుల్లో పని ప్రదేశాల్లో నిర్లక్ష్యపు పర్యవేక్షణతో ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు. వాటిని అరికట్టాల్సిన బాధ్యత గని ఉన్నతాధికారులదేనన్నారు. ఏరియాలో భద్రతా ప్రమాణాలు పాటిస్తూ ఉత్పత్తి చేయాలన్నారు. అనంతరం జీఎం సేఫ్టీగా విధులు చేపట్టి మొదటిసారిగా ఇల్లెందుకు వచ్చిన గురువయ్యకు జీఎం, అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అధికారులు బండి వెంకటయ్య, పీ శ్రీనివాస్, బొల్లం వెంకటేశ్వర్లు, మల్లారపు మల్లయ్య, కే సత్యనారాయణ, రాజు, శివప్రసాద్, జీవన్‌కుమార్, చెన్నయ్య, శివశంకర్, గిరిధర్‌రావు, నరసింహారావు, విజయభాస్కర్, జీవీ మోహన్‌రావు, ఆదినారాయణ, వెంకటరామచంద్ర, బాలాజీనాయుడు, సైదులు, డాక్టర్ నేరెళ్లు, తదితరులు పాల్గొన్నారు.