
నేరడిగొండ, జనవరి 3 : తేజాపూర్ గ్రామంలో రెడ్డి సంక్షేమ సంఘం నూతన సంవత్సర క్యాలెండర్‌ను మంగళవారం సంఘ సభ్యులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు నారాయణరెడ్డి, భూమారెడ్డి, సురేందర్‌రెడ్డి, పోతారెడ్డి, రవీందర్‌రెడ్డి, అజయ్‌రెడ్డి, మనోజ్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి, కమలాకర్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు.
పీఆర్టీయూ టీఎస్..
నేరడిగొండ, జనవరి 3 : మండల కేంద్రంలోని ఎమ్మార్సీ భవనంలో ఎంపీపీ రాథోడ్ సజన్, ఎంఈవో భూమారెడ్డి పీఆర్టీయూ టీఎస్ నేరడిగొండ శాఖ నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పీఆర్టీయూ(టీఎస్) మండలాధ్యక్షుడు కమలాకర్, ప్రధాన కార్యదర్శి గంగాధర్, రాష్ట్ర బాధ్యులు రాజేశ్వర్, బ్రహ్మానందం, మౌలనా, జిల్లా కార్యదర్శి మహేందర్, బాలకృష్ణ, భోజన్న పాల్గొన్నారు.
సిరికొండ, జనవరి 3 : మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో పీఆర్టీయూ మండల నాయకులు, ఉపాధ్యాయులు నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పీఆర్టీయూ మండలాధ్యక్షుడు కాంతయ్య, ఉపాధ్యాయులు రాధాకృష్ణ, కమల్ సింగ్, వేణుగోపాల్, శ్రీనివాస్, భాస్కర్ పాల్గొన్నారు.
తలమడుగు, జనవరి 3: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్, సంఘం నాయకులు. ప్రజాప్రతినిధులు, అధికారులు నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ కల్యాణం లక్ష్మి, వైస్‌ఎంపీపీ దివ్య, ఎంపీడీవో రమాకాంత్, ఎంఈవో నారాయణ, పీఆర్టీయూ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మహేందర్ యాదవ్, నవీన్ యాదవ్, సంఘం నాయకులు పాల్గొన్నారు.