
ఎదులాపురం, జనవరి 3 : మైనార్టీ విద్యార్థుల విద్యపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జాతీయ మైనార్టీ కమిషన్ సభ్యురాలు సయ్యద్ షేహ జాది పేర్కొన్నారు. జిల్లా కేంద్రం లోని టీటీడీసీలో వివిధ శాఖల అధి కారులు, మైనార్టీ పాఠశాలలు, కళా శాలల అధ్యాపకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషన్ సభ్యురాలు మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లాలో చదువుతున్న మైనార్టీ విద్యా ర్థులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలన్నారు. వారి విద్యాభ్యాసంపై చొరవ చూపాలన్నారు. ఉట్నూర్ దర్గా వద్ద మరుగుదొడ్లు, తాగునీరు సౌక ర్యాలు కల్పించాలని మైనార్టీ సంక్షేమ శాఖ అధికా రికి అదేశించారు. సమావేశంలో ఆర్టీవో జాడే రాజేశ్వర్, మైనార్టీ సంక్షేమ అధికారి కృష్ణవేణి, ఐసీడీఎస్ అధికారి మిల్కా, ఎస్సీ సంక్షేమ అధికా రి సునీత, బీసీ సంక్షేమ అధికారి రాజలింగం వివిధ శాఖ అధికారులు, మైనార్టీ పాఠశాలలు, కళాశాలల అధ్యాపకులు పాల్గొన్నారు.
మైనార్టీ గురుకులం తనిఖీ
ఎదులాపురం, జనవరి 3 : బాలికలు అన్ని రంగాల్లో ప్రతిభ చూపాలని జాతీయ మైనార్టీ కమి షన్ సభ్యురాలు సయ్యద్ షేహజాది అన్నారు. జిల్లా కేంద్రంలోని బంగారుగూడలోని తెలం గాణ రాష్ట్ర మైనార్టీ గురుకులం జూనియర్ కళాశాలను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా కమిషన్ సభ్యురాలు మాట్లాడుతూ బాలికలు చిన్న వయ స్సులోనే విద్యాభ్యాసంలో రాణించడం ద్వారా సివిల్ సర్వీసెస్ వంటి పోటీ పరీక్షల్లో ప్రతిభ చూప వచ్చన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాలు కింద అందిస్తున్న ఉపకార వేతనాలను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. అంతకు ముందు విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. విద్యార్థులతో పాటు క్యూలో ఉంచి భోజనాన్ని స్వీకరించారు. అనంతరం భోజనశాల, స్టోర్ రూం, వసతి గదు లు, మరుగుదొడ్లను పరిశీలించారు. క్యారం బోర్డ్ ఆడారు. మైనార్టీ సంక్షేమ జిల్లా అధికారి కృష్ణవే ణి, కళాశాల ప్రిన్సిపాల్ రజనీ, అధ్యాపకురాలు ఉన్నారు. పట్టణంలో తాను చదివిన ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. అబ్దు ల్ కలాంను ఆదర్శంగా తీసు కొని విద్యార్థులు ముందుకు సాగాలన్నారు. అనంతరం తనకు విద్యనేర్పిన గురువులతో కలిసి ఆనందంగా గడి పారు. డీఈవో ప్రణీత, మైనార్టీ అధికారి కృష్ణవేణి, సెక్టోరియల్ అధికారి కంటె నర్సయ్య, నారాయణ పాల్గొన్నారు.
నేడు నిర్మల్‌కు రాక
నిర్మల్ టౌన్, జనవరి 3 : మంగళవారం జాతీయ మైనార్టీ కమిషన్ సయ్యద్ సయ్యద్ షేహజాది నిర్మల్ జిల్లా పర్యటనకు వస్తున్నట్లు జిలా పౌర సంబంధాలశాఖాధికారి ఉమరాణి తెలిపారు. రాత్రి 10 గంటలకు నిర్మల్‌కు చేరుకో నుందని పేర్కొన్నారు.