మంచిర్యాలటౌన్, అక్టోబర్ 2: జాతిపిత, మహాత్మా మోహన్‌దాస్ కరమ్ చంద్ గాంధీ 152వ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని స్టేషన్‌రోడ్‌లో ఉన్న గాంధీపార్కులో ఉన్న గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు పూలమాలలువేసి నివాళులర్పించారు. మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, టీఆర్ఎస్ నాయకులు పూల మాలలేసి నివాళులర్పించారు. గాంధీ పార్కులో గాంధీ, నెహ్రూల కాం స్య విగ్రహాల ఏర్పాటుకు కృషిచేసిన, ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్, కమిషనర్లను స్థానికులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేశ్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ వసుంధర, వైస్‌చైర్మన్ ముఖేశ్‌గౌడ్, కమిషనర్ బాలకృష్ణ, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పల్లపు తిరుపతి, గరిగంటి సరోజ, సుధీర్, బింగి ప్రవీణ్, నజీర్, నాయకులు అత్తి సరోజ, గోగుల రవీందర్‌రెడ్డి, తోట తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.
మహాత్మా గాంధీజీ పోరాటం ఆదర్శనీయం..
హాజీపూర్, అక్టోబర్ 2 :అహింసా మార్గం ద్వారా పోరాడి స్వాతంత్య్ర సాధించిన మహాత్మాగాంధీ అందరికీ ఆదర్శమని కలెక్టర్ భారతీ హోళికేరి అన్నారు. శనివారం జిల్లా కలెక్టరేట్లో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, కలెక్టరేట్ పరిపాలనాధికారి సురేశ్, పర్యవేక్షకులు సంతోష్, జిల్లా పౌర సంబంధాల అధికారి వై సంపత్ కుమార్‌తో పాటు సంబంధిత శాఖల అధికారులున్నారు. జడ్పీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో జడ్పీ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి, జడ్పీ సీఈవో కాకరాల నరేందర్, కార్యాలయం సూపరింటెండెంట్లు బాలకృష్ణ, సత్యనారాయణ, శ్రీనివాస్ తదితరులున్నారు. ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఎంపీపీ మందపెల్లి స్వర్ణలత, ఎంపీడీవో అబ్దుల్ హై, ఎంపీవో రవిబాబు గాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ మందపెల్లి శ్రీనివాస్, కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు. వాసవీక్లబ్ ఆధ్వర్వంలో మానసిక వికలాంగుల పునరావాస ఆశ్రమానికి నెలకు సరిపడా నిత్యావసర సరుకులను, బియ్యాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో వాసవీక్లబ్ అంతర్జాతీయ ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్షుడు సిరిపురం రాజేశ్, అంతర్జాతీయ జాయింట సెక్రెటరీ శ్రీనివాస్, రీజియన్ చైర్మన్ పుల్లూరి బాల్మోహన్, వుత్తూరి రమేశ్, వాసవీక్లబ్ అధ్యక్షుడు కాచం సతీశ్, కార్యదర్శి కేశెట్టి వంశీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ నాన్ గెజిటెడ్ (టీఎన్జీవో) ఉద్యోగుల సంఘం ఆధ్వర్వంలో గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి భూ ముల రామ్మోహన్, కోశాధికారి సత్యనారాయణ, సంయుక్త కార్యదర్శి ప్రభు, మంచిర్యాల యూనిట్ అధ్యక్షుడు నాగుల గోపాల్, కార్యదర్శి ప్రభు లింగం, ఆర్గనైజింగ్ సెక్రెటరీ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో..
మంచిర్యాల ఏసీసీ, అక్టోబర్ 2: మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకల్లో రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ భాస్కర్ రెడ్డి, వైస్ చైర్మన్ చందూరి మహేందర్, డాక్టర్ కే చంద్రకళ, రక్తనిధి కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు. దేశభక్తుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సూదిరెడ్డి నరేందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు అల్లాడి శ్రీనివాస్, ట్రెజరర్ శ్రీనివాస్ రెడ్డి, తాడోజు సత్యనారయణ వేడుకల్లో పాల్గొన్నారు.
ఉత్తమ సేవలకు ప్రశంసా పత్రాల అందజేత
సీసీసీ నస్పూర్, అక్టోబర్ 2: గాంధీ జయంతి సందర్భంగా నస్పూర్ మున్సిపాలిటీలో అత్యుత్తమ సేవలు అందించిన ఆరుగురు పారిశుధ్య కార్మికులను మున్సిపల్ చైర్మన్ ఇసంపల్లి ప్రభాకర్, కమిషనర్ రాజలింగు, కౌన్సిలర్లు శాలువాలతో సత్కరించి, ప్రశంస పత్రాలను అందజేశారు.