
ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్
రిమ్స్‌లో పది పడకల ఐసీయూ ప్రారంభం
రూ. 30 లక్షలతో ఏర్పాటు చేసిన సేల్స్‌ఫోర్స్ సంస్థ
ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్
ఎదులాపురం, జూలై 2 : గిరిజన ప్రాంతాల్లో స్వచ్ఛంద సంస్థల సహకారం అభినందనీయమని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సేల్స్‌ఫోర్స్ సహకారంతో రిమ్స్ దవాఖానలో పది పడకల ఐసీయూ (ఇంటెన్సివ్‌కేర్ యూనిట్)ను శుక్రవారం కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. కొవిడ్ కష్టకాలంలో దేశంలోని 700 జిల్లాల్లో ఐసీయూలను సేల్స్‌ఫోర్స్ స్వచ్ఛంద సంస్థ ప్రారంభించిందని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజల సౌకర్యార్థం పది పడకల ఇంటెన్సివ్‌కేర్ యూనిట్‌ను రూ.30 లక్షలతో ఏ ర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజలకు సేవలందించడం అభినందించాల్సిన విషయమన్నారు. భవిష్యత్‌లో కొవిడ్ ఉధృతిని తగ్గించడానికి పది పడకల ఐసీయూ ప్రాజెక్టు జిల్లా ప్రజలకు సహాయ పడుతుందన్నారు. రిమ్స్ డైరెక్టర్ బలరాం నాయక్ మాట్లాడుతూ.. పది పడకల ఐసీయూ ఏర్పాటుకు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. అంతకుముందు ఐసీయూ చైర్మన్ శ్రీకాంత్ నాగమణి, సీఈవో రేఖా శ్రీనివాసన్, సంస్థ చేపడుతున్న కార్యకలాపాలపై జూమ్ ద్వారా వివరించారు. సేల్స్‌ఫోర్స్ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆశిష్కొరాది, సభ్యురాలు ఉమ, రిమ్స్ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.