
ఉపాధ్యాయులకు పెద్దగా నష్టం లేదు..
అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు..
ఉపాధ్యాయులను బజారుకు లాగడం పద్ధతి కాదు
కరోనాను అందరికీ అంటగడుతారా అని మండిపాటు
ఆదిలాబాద్, జనవరి 2(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీలు సహజం. దీనిని సాకుగా చూపుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దొంగ దీక్ష చేపట్టారనే అభిప్రాయాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ సంఘాల ఆమోదంతోనే 371 జీవో జారీ చేసినా.. రాజకీయంగా లబ్ధిపొందాలని చూస్తున్నారని మండిపడుతున్నారు. ఉపాధ్యాయులకు పెద్దగా నష్టం లేకపోయినా అనవసరంగా రాద్ధాంతం చేయడం సరికాదంటున్నారు. కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సూచించిన మార్గ దర్శకాలు అమలు చేస్తుండగా, బాధ్యత గల ఎంపీ దీక్షకు దిగడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు సహజమేనని, ఉపాధ్యాయుల బదిలీలను సాకుగా చూపుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సం జయ్ రాజకీయ లబ్ధి పొందాలని చూ స్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా యి. జీవో నంబరు 317ను సవరణ చేయా లం టూ సంజయ్ దీక్ష చేపట్టడం ఏమాత్రం స రికాదని, జీవో వల్ల తక్కువ మంది ఉపాధ్యా యులకు మాత్రమే ఇబ్బందులుంటా యని పలువురు అంటున్నారు. రాష్ట్రంలో కరోనా, ఒమిక్రాన్ కేసు లు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సూచించిన మా ర్గదర్శకాల ప్రకారం నిబంధనలు అమలు చేస్తుండగా బాధ్యత గల ఎంపీ దీక్షకు దిగడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. దీక్షకు వచ్చిన వారి నుంచి కరోనా, ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతాయని ఫలి తంగా లాక్డౌన్ విధించే అవకాశాలు కూడా లే కపోలేదని అంటు న్నారు.. దీంతో పిల్లలు చదు వులు ఆగిపోవడం, కూలీలకు ఉపా ధి దొరకక పస్తులుండడం, ప్రభుత్వ ఆదాయం పడిపోవ డం వం టి ఇబ్బందులు కలుగుతాయన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉ ద్యోగుల బదిలీలను రాజకీయం చేయడం మానుకోవాలని పలు వురు సూచిస్తున్నారు.
లాక్డౌన్ పెడితే ఎవరు బాధ్యులు
కరోనాతో రెండేండ్లుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని రోజులుగా దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నా యి. ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్ర భుత్వం కరోనా నిబంధనలు పాటించాలని మార్గదర్శకా లు జారీ చేసింది. ఎంపీ బండి సంజయ్ దొంగ దీక్షల పేరిట కరోనాను వ్యాప్తి చేసేందుకు ప్రయత్నా లు చేస్తున్నారు. కేసులు పెరిగి లాక్డౌన్ పడితే రోజువారి కూలీలు, విద్యార్థులు, చిరు వ్యాపారులు, అందరు నష్టపోతారు.