
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
విజయ గర్జన సభను విజయవంతం చేద్దాం
రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
నిర్మల్ అర్బన్, నవంబర్1: రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు టీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని దివ్య గార్డెన్లో టీఆర్ఎస్ నిర్మల్ నియోజకవర్గ విస్తృత స్థాయి సన్నాహక సమావేశానికి మంత్రి హాజరై మాట్లాడారు. పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నవంబర్ 15న వరంగల్‌లో నిర్వహించనున్న విజయ గర్జన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తుందని పేర్కొన్నారు. నిర్మల్ పట్టణ, మండలాల్లోని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున సభకు తరలి రావాలని కోరారు. గ్రామ, వార్డుకు ఒక బస్సు చొప్పున మొత్తం 170 బస్సులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పార్టీ నాయకులు, ఇన్చార్జిలు కార్యకర్తలను సమన్వయం చేసుకుని సభకు తీసుకురావాలని ఆదేశించారు. కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్, జడ్పీ చైర్ పర్సన్ విజయలక్ష్మి, డీడీసీ చైర్మన్ లోక భూమారెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ గౌడ్, డీసీసీబీ చైర్మన్ రఘునందన్ రెడ్డి, నల్లా వెంకట్రాంరెడ్డి, యువ నాయకుడు అల్లోల గౌతంరెడ్డి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు పాకాల రాంచందర్, పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్మదాముత్యంరెడ్డి పాల్గొన్నారు.
విజయగర్జన సభ విజయవంతం చేయాలి
ఖానాపూర్ రూరల్, అక్టోబర్ 1: టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం, సాధించిన విజయాలను తెలిపేందుకు నవంబర్ 15న వరంగల్‌లో టీఆర్ఎస్ విజయగర్జన సభ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర అటవీ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఖానాపూర్ మండలం మస్కాపూర్ ఎల్ఆర్ గార్డెన్లో ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ ఆధ్వర్యంలో టీఆర్ఏస్ నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఖానాపూర్ నియోజకవర్గం నుంచి 10 వేల మంది కార్యకర్తలు వరంగల్ సభకు తరలిరావాలని తెలిపారు. 10 లక్షల మందితో భారీ ఎత్తున సభను నిర్వహించి విజయవంతం చేసేందుకు అవసరమైన కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే రేఖానాయక్ మాట్లాడుతూ 20 ఏండ్లలో సాధించిన విజయాలు, ప్రగతిని ముఖ్యమంత్రి కేసీఆర్ నివేదిస్తారని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, వైస్ చైర్మన్ కలీల్, ఏఎంసీ చైర్మన్ పుప్పాల శంకర్, వైస్ చైర్మన్ గొర్రె గంగాధర్, ఎంపీపీ మొహిద్, పీఏసీఎస్ చైర్మన్లు ఆమంద శ్రీనివాస్, సత్యనారాయణరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాజగంగన్న, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, డైరెక్టర్లు, నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ప్రగతి నివేదనకే విజయగర్జనసభ..
తానూర్, నవంబర్, 1: తెలంగాణ ప్రభుత్వం ఏడేళ్లలో సాధించిన ప్రగతిని నివేదించడానికి వరంగల్‌లో విజయగర్జన సభ ఏర్పాటు చేసినట్లు ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఎంఎస్ఆర్ ఫంక్షన హాల్లో టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 70 ఏండ్ల సమైక్య పాలనలో జరగని అభివృద్ధిని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో ఏడేళ్లలో సాధించామన్నారు. ఈ నెల 15న నిర్వహించే విజయగర్జన సభకు మండలం నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు హాజరుకావాలని పిలుపునిచ్చారు. హంగిర్గా సొసైటీ చైర్మన్ నారాయణ్‌రావు పటేల్, ఆత్మ చైర్మన్, పార్టీ మండల కన్వీనర్ పోతారెడ్డి, వైస్ ఎంపీపీ చంద్రకాంత్, తానూర మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు తాడేవార్ విఠల్, మాజీ ఎంపీపీ బాశెట్టి రాజన్న, నాయకులు చంద్రకాంత్, భోజన్న, శ్రీనివాస్‌రెడ్డి, కేశవ్, సూర్యకాంత్ సుభాష్, రాములు, భీం పవార్, దత్తురాం పటేల్, బాలాజీ, పల్లె విఠల్, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.