
ఎదులాపురం, నవంబర్ 1 : బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర అన్నారు. జిల్లాకేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో టైపిస్ట్‌గా విధులు నిర్వర్తించి అనారోగ్యంతో మృతి చెందిన షేక్ మక్బూల్ కు టుంబ సభ్యులకు రాష్ట్ర భద్రతా స్కీమ్ ద్వారా మంజూరైన రూ.4 లక్షల చెక్కును సోమవారం అందజేశారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారన్నారు. ఇటీవలే ఆయన కుమార్తె ఇంటర్ పరీక్షల్లో 990 మార్కులు సాధించి రాష్ట్ర స్థా యిలో రెండో స్థానం సాధించడంతో ఇన్చార్జి ఎస్పీ అభినందించారు. కుటుంబపరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేందుకు అసోసియేషన్ సభ్యులు కృషి చేస్తారని చెప్పారు. ప్రభుత్వ పరంగా వచ్చే ప్రయోజనాలను సత్వరమే అందజేస్తామన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ పరిపాలన శ్రీనివాసరావు, పోలీస్ కార్యాలయం పరిపాలన అధికారి మహమ్మద్ యూనిస్అలీ, పోలీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు , క్యాంపు కార్యనిర్వాహణాధికారి దుర్గం శ్రీనివాస్, ఫిర్యాదుల విభాగం ఇన్చార్జి ఏఎస్ఐ జైస్వాల్ కవిత, పర్యవేక్షకుడు ఎస్. సంజీవ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర అన్నారు. తన కార్యాలయంలో హైదరాబాద్ ఫోరెన్సిక్ సైన్స్ సెంట్రల్ యూనివర్సిటీలో సైబర్ నేరాలపై విద్యాభ్యాసం చేసిన యువకుడు అఖిలేశ్ కుమార్‌తో ఆయన సమావేశమయ్యారు. జైనథ్ మండలం సాంగ్వీ(కే) గ్రా మానికి చెందిన ట్రాఫిక్ కానిస్టేబుల్ రమేశ్ కుమార్ కుమారు డు అఖిలేశ్ కుమార్ హైదరాబాద్ ఉమెన్ సేఫ్టీ వింగ్ డీఐజీ సుమతి ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఎం పికయ్యాడు. దీంతో ఆదిలాబాద్ జిల్లాలో షీటీం సభ్యులతో కలిసి క్షేత్రస్థాయిలో మరింత ప్రావీణ్యం పొందడానికి అవకా శం కల్పించారు. ఈ నేపథ్యంలో ఇన్చార్జి ఎస్పీ మాట్లాడుతూ సైబర్ బాధితులు 24 గంటల్లోపు సైబర్ ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నంబర్155260 లేదా డయల్100కు ఫోన్ చేసి సమాచారం అందిస్తే పోగొట్టుకున్న నగదును స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ వినోద్ కుమార్, పోలీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు , ట్రాఫిక్ కానిస్టేబుల్ రమేశ్ కుమార్ పాల్గొన్నారు.