
ఒకే రోజు110 ఎకరాల్లో 3.50 లక్షల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు
బర్త్ డే సందర్భంగా అంతా సిద్ధం చేసిన టీఆర్ఎస్ నాయకులు
హాజరుకానున్న ఎంపీ సంతోష్‌కుమార్
ఆదిలాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంతో అడవులు పునర్జీవం పోసుకుంటున్నాయి. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారు. ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటుతూ వాటిని సంరక్షించే చర్యలు తీ సుకుంటున్నారు. కాగా, ఈ నెల 4న ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పుట్టిన రోజు సందర్భంగా పెద్ద సంఖ్యలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఎంపీ సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ చాలెంజ్‌లో భాగంగా ఒకే రోజు 3.50 లక్షల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దుర్గానగర్ ఫారెస్ట్ బ్లాక్‌లోని మైదాన ప్రాంతంలో 110 ఎకరాల్లో మియావాకి విధానంలో మొక్కల పెం పకం చేపట్టనున్నారు. కాగా, ఏర్పాట్లను ఎమ్మెల్యే జోగు రామన్న, టీఆర్ఎస్ నాయ కులు పర్యవేక్షిస్తున్నారు. అవసరమైన సూచనలు చేస్తున్నారు.
పాల్గొననున్న 20 వేల మంది
సుమారు 20 వేల మంది ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పది రోజుల నుంచి ఈ కార్యక్రమ ఏర్పాట్లు జరుగుతుండగా, మైదానాన్ని చదును చేయడం, గుంతలు తవ్వడం, మొక్కలను తీసుకురావడం జరుగుతుంది. రేపటి వరకు గుంతలు తీయడం, నాటేందుకు మొక్కలను సిద్ధం చేయనున్నారు. 21 రకాల వివిధ మొక్కలను నాటనుండగా, ఉదయం 10.30 నుంచి 11.30 వరకు మొక్కలు నాటనున్నారు. గంట వ్యవధిలోనే 3.50 లక్షల మొక్కలు నాటడం పూర్తి చేయనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. గ్రీన్ చాలెంజ్‌లో భాగంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి ఎంపీ సంతోష్‌కుమార్ హాజరుకానున్నారు. ఇప్పటికే గ్రీన్ చాలెంజ్ ప్రతినిధులు కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించారు.
విజయవంతం చేయాలి
భావితరాల మనుగడకు మొక్కల పెంపకం ఎంతో అవస రం. నా పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ చాలెంజ్‌లో భాగంగా దుర్గానగర్ ఫారెస్ట్ బ్లాక్‌లో 3.50 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించాం. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నాం. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతున్నా.