
ఆదిలాబాద్ రూరల్, జూలై 1: దళితుల సాధికరతే ప్రభుత్వ లక్ష్యమని టీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. మావల మండల కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే జోగు రామన్న చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకుడు దొగ్గలి రాజేశ్వర్ మాట్లాడారు. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల లబ్ధి చేకూర్చేలా ప్రణాళికలు రూపొందించడం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దళితులపై ఉన్న ప్రేమకు నిదర్శమని అన్నారు. ఉప సర్పంచ్ మహేందర్ యాదవ్, గంగు ల కిరణ్, చందాల రాజన్న, ఉమాకాంత్‌రెడ్డి, పొచ్చన్న, అజీంఖాన్, విజయ్, సంతోష్‌రెడ్డి, గంగన్న, సంతోష్ పాల్గొన్నారు.ఆదిలాబాద్‌లోని 33వ వార్డులో కౌన్సిలర్ అజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే జోగు రామన్న చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, నాయకులు పాల్గొన్నారు.
బజార్హత్నూర్, జూలై 1: మండలంలోని దేగామలో సీఎం కేసీఆర్, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ చిత్రపటాలకు టీఆర్ఎస్ మండల కన్వీనర్ రాజారాం, దళితసంఘం, టీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు. కార్యక్రమం లో పీఏసీఎస్ చైర్మన్ మేకల వెంకన్న, నాయకులు నరేశ్, ప్రభు, అక్షయ్, దళిత సంఘం నాయకులు పాల్గొన్నారు.
ఇచ్చోడ, జూలై 1 : మండలంలోని ధరంపురిలో టీఆర్ఎస్ మహార్ బెటాలియన్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకుడు సోన్కాంబ్లే కృష్ణ కుమార్ గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి, నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ డుకురే సుభాష్ పాటిల్, టీఆర్ఎస్ మహార్ బెటాలియన్ నాయకుడు నర్వాడే రమేశ్, రైతులు యశ్వంత్, మారుతి, చంద్రకాంత్, శేషరావ్, మహిళలు పాల్గొన్నారు.
బేల, జూలై 1 : మండలంలోని సాంగిడి గ్రామంలో ఎంపీపీ వనిత ఠాక్రే దళిత సంఘాల నాయకులతో కలిసి సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే జోగురామన్న చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. దళిత సాధికారత పథకం ఇతర రాష్ర్టాలకు ఆదర్శం కానుందన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పవర్ అక్షిత, ఎంపీటీసీ రాకేశ్, టీఆర్ఎస్ నాయకులు గంభీర్ ఠాక్రే, కన్నల గంగన్న, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.