
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న
పార్టీలో పలువురు చేరిక
ఆదిలాబాద్ రూరల్, ఫిబ్రవరి 1: టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. ఆదిలాబాద్‌లోని వారు నంబర్-1లో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఎమ్మెల్యే సమక్షంలో జై జవాన్నగర్లో బీజేపీ, కాంగ్రెస్ నుంచి నాయకులు టీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏడేళ్లల్లో పల్లె పట్టణం తేడా లేకుండా అభివృద్ధి జరిగిందన్నారు. పుట్టిన బిడ్డ నుంచి వృద్ధాప్యం వరకు అందరిని ఆదుకునేలా రాష్ట్ర ప్రభుత్వం పథకాలు అమలు చేస్తున్నదని తెలిపారు. ఆదిలాబాద్‌లో రెండేళ్లలో కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టామని పేర్కొన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మున్సిపల్వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, కౌన్సిలర్ నర్సింగ్, నాయకులు వెంకన్న, అశోక్ స్వామి, శంకర్, తదితరులు పాల్గొన్నారు.