నిర్మల్ ఇన్చార్జి ఎస్పీ ప్రవీణ్‌కుమార్
హోంగార్డు కుటుంబానికి రూ.15 వేల చెక్కు అందజేత
నిర్మల్ అర్బన్, నవంబర్ 30 : బాధిత పోలీస్ కుటుంబాలకు అండగా ఉంటామని నిర్మల్ ఇన్చార్జి ఎస్పీ ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం హోంగార్డు బీరవెల్లి కవిత కుటుంబానికి రూ.15 వేల చెక్కును అందజేశారు. బాసర ఆలయంలో విధులు నిర్వహిస్తున్న కవిత, అనారోగ్యంతో మృతిచెందింది. కాగా, కవిత కూతురు సాయి స్వీజకు చెక్కు అందించారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని రకాల బెనిఫిట్స్ త్వరగా అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, హోంగార్డు ఆర్ఐ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
పెండింగ్ చలాన్లు చెల్లించాలి..
ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులు పెండింగ్ చలాన్లను ఎప్పటికప్పుడు చెల్లించాలని ఇన్చార్జి ఎస్పీ ప్రవీణ్‌కుమార్ సూచించారు. 3 కంటే ఎక్కువ చలాన్లు ఉంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, 15 రోజుల్లోగా చెల్లించాలని సూచించారు. లేకపోతే వాహనాన్ని కూడా సీజ్ చేస్తామని తెలిపారు.