
రైతును రాజు చేసేందుకు సర్కారు కృషి
మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
దిలావర్పూర్లో నిర్మల్ జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మితో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
దిలావర్పూర్, అక్టోబర్ 31 : మార్కెట్ డిమాండ్‌ను బట్టి పంటలు సాగు చేసి, ఆర్థికంగా బలోపేతమవ్వాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి రైతులకు సూచించారు. దిలావర్పూర్లో ఆదివారం బన్సపల్లి సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నిర్మల్ జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మితో కలిసి మంత్రి ప్రారంభించారు. అంతకుముందు స్థానికంగా ఉన్న పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేంద్ర సర్కారు వరి ధాన్యం కొనుగోలు చేయకపోయినా రైతును రాజు చేసేందుకు మద్దతు ధర కల్పిస్తూ కొంటామని భరోసా ఇచ్చారు. ఆరబెట్టిన తర్వాతే ధాన్యం తీసుకురావాలని సూచించారు. మొదటి రకం ధాన్యానికి మద్దతు ధర రూ.1960, రెండో రకానికి రూ.1940గా సర్కారు నిర్ణయించిందన్నారు. కొనుగోలు చేసిన 10 రోజుల్లోగా రైతుల ఖాతాల్లో డబ్బు జమ అవుతుందని తెలిపారు. రైతులు ఒకే రకమైన పంటలు సాగుచేయవద్దని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు భూ సార పరీక్షలు చేయించి, పంటల మార్పిడి పద్ధతి అవలంబించాలన్నారు. పోచమ్మ ఆలయం వద్ద కోనేరు నిర్మాణానికి రూ.25 లక్షలు, ఎల్లమ్మ ఆలయానికి రూ.80 లక్షలు, ఏక్నాథ్ ఆలయ నిర్మాణానికి రూ.50 లక్షలు త్వరలోనే మంజూరవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బన్సపల్లి సహకార సంఘం చైర్మన్ పీవీ రమణారెడ్డి, స్థానిక సర్పంచ్ వీరేశ్‌కుమార్, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు కొమ్ముల దేవేందర్‌రెడ్డి, ఎంపీపీ బాబురావు, జిల్లా సహకార సంఘం మాజీ అధ్యక్షుడు రాంకిషన్‌రెడ్డి, నిర్మల్ సహకార సంఘం ఉపాధ్యక్షుడు దుప్పి సాయన్న, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు సుభాష్‌రావు, రైతుబంధు సమితి జిల్లా సభ్యులు ఏలాల చిన్నారెడ్డి, సహకార సంఘం డైరెక్టర్ కోడె సుధాకర్‌రెడ్డి, ఎంపీటీసీలు పాల్దే అక్షర, అనిల్, మండల కోఆప్షన్ సభ్యులు అన్వర్‌ఖాన్, కదిలి, కాల్వ ఆలయ చైర్మన్లు భుజంగ్రావుపటేల్, చిన్నయ్య, అత్మ డైరెక్టర్ గుణవంత్‌రావు, అరుణ్, కృష్ణ, తహసీల్దార్ హిమబిందు, వ్యవసాయ శాఖ అధికారి స్రవంతి, సహకార సంఘం సిబ్బంది సుకుమార్, రైతులు పాల్గొన్నారు.
విజయ డెయిరీ పాల కేంద్రం ప్రారంభం..
నిర్మల్ చైన్‌గేట్, అక్టోబర్ 31 : నిర్మల్ పట్టణంలోని బస్టాండ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన విజయ డెయిరీ పాలకేంద్రాన్ని మంత్రి అల్లోల, రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ (డీడీసీ) లోక భూమారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జీ ఈశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, ఎంపీపీ రామేశ్వర్‌రెడ్డి, నాయకులు ముత్యంరెడ్డి, పాకాల రాంచందర్, స్థానిక కౌన్సిలర్ చౌస్ తదితరులు పాల్గొన్నారు.