
మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో 2-3 సెకన్ల పాటు ప్రకంపనలు
భయాందోళనలో ప్రజలు
దిందాలో కూలిన గుడిసె
మంచిర్యాల, నమస్తే తెలంగాణ, అక్టోబర్ 31: జిల్లాలో మళ్లీ స్వల్పంగా భూకంపం వచ్చింది. జిల్లాలోని పలు చోట్ల మూడు నుంచి నాలుగు సెకండ్ల పాటు భూమి కం పించడంతో జనం ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఆదివా రం సాయంత్రం 6.48 గంటల ప్రాంతంలో జిల్లాకేంద్రంతో పాటు లక్షెట్టిపేట, చెన్నూర్ మండలం ముత్తరావు పల్లె, కిష్టంపేట, కోటపల్లి మండలంలోని రాంపూర్, రొయ్యలపల్లి, వేమనపల్లి మండలంలోని నీల్వాయి, గొర్లపల్లి, బెల్లంపల్లి, తాం డూర్ మండలంలోని మాదారం టౌన్ షిప్, దండేపల్లి, నెన్నెల్లో, హాజీపూర్ మండలంలోని ముల్కల్ల, గుడిపేట, నంనూర్, రాపెల్లి, దొనబండ, పాత మంచిర్యాల, హాజీపూర్ లో భూమి స్వల్పంగా కంపించింది. సరిహద్దు రా ష్ట్రం మ హారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో కూడా భూకంపం వ చ్చినట్లు తెలిసింది. గడ్జిరోలిలో 4.3గా నమోదైంది. గత శనివారం కూడా మంచిర్యాల చుట్టు పక్కప్రాంతాల్లో భూకంపం సంభవించడం, రిక్టర్ స్కేల్లో 4.3గా నమోదుకావడం గమనార్హం.
ఆసిఫాబాద్ జిల్లాలో..
చింతలమానేపల్లి/బెజ్జూర్, అక్టోబర్ 31 : చింతలమానేపల్లి మండలకేంద్రంతో పాటు గూడెం, దిందా ,బాలాజీఅన్‌కోడ, గంగాపూర్, బాబాపూర్, కర్జెల్లి,రవీంద్రనగర్-2లో ఆదివారం భూమి 3 సెకనుల పాటు కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. దిందా గ్రామంలో వాగుమరి రాకేశ్‌కు చెందిన పశువుల కొట్టం కూలినట్లు బాధితుడు తెలిపాడు. బెజ్జూర్ మండలంలో ఇళ్లలోని వంటసామగ్రి కిందపడిపోయింది. రోడ్డు నిర్మాణంలో వాడిన వైబ్రేటరీ రోడ్డు రోలర్ నడిపించినట్లు అనిపించింది.