
ఇంద్రవెల్లి/కాగజ్‌నగర్ రూరల్, అక్టోబర్31 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్నగర్కుపులి చర్మం తరలిస్తున్న ముఠాను కాగజ్‌నగర్ అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. ఆదిలాబాద్ డీఎఫ్‌వో రాజశేఖర్ తెలిపిన వివరాలిలా.. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం వాల్గొండ అటవీ ప్రాం తంలో గ్రామానికి చెందిన కొందరు గతేడాది డిసెంబర్లో పులిని హతమార్చారు. అప్పటి నుంచి పులి చర్మాన్ని భద్రం గా దాచి ఉంచి.. శనివారం పులి చర్మాన్ని విక్రయించడానికి కాగజ్‌నగర్‌కు తరలిస్తుండగా ముందస్తు సమాచారం మేరకు అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. పులి చర్మాన్ని స్వా ధీనం చేసుకున్నారు. వాల్గొండ గ్రామానికి చెందిన పలువురి అనుమానితుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. కొన్ని పులి అవయవాలను స్వాధీనం చేసుకున్నారు. పంట చేలను పరిశీలించి వివరాలు సేకరించారు. ప్రస్తుతం కాగజ్‌నగర్ డివిజన్ కార్యాలయంలో విచారణ చేపడుతున్నామని తెలిపారు. పూర్తి వివరాలు తెలిసిన తర్వాత వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. ఉట్నూర్ ఎఫ్‌డీవో కిషన్‌జాదవ్, ఆయా మండలాలకు చెందిన అటవీ శాఖ అధికారులు శివకుమార్, శ్రీనివాస్, పాండురంగ్, గులాబ్‌సింగ్, బిజారం గణేశ్ ఉన్నారు.
ఆందోళన
పులి చర్మం పట్టుకున్న కేసులో మండలంలోని వడగాం గ్రామానికి చెందిన ఓ అధికారికి ఎలాంటి సంబంధం లేదని ఆయనను బేషరతుగా విడుదల చేయాలని తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు జీ గణేశ్, ప్రధానకార్యదర్శి పు ర్కా బాపురావ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు అధికారి కుటుం బ సభ్యులతో కలిసి ఇంద్రవెల్లి మండలకేంద్రంలో తీవ్ర ఆందోళన చేపట్టా రు. ఉట్నూర్ ఏఎస్పీ హర్షవర్ధన్ అక్కడికి చేరుకొని ఆదివాసులకు నచ్చజెప్పినప్పటికీ వినలేదు. దీంతో ఎంపీ సోయం బాపురావ్‌తో ఫోన్లో మాట్లాడుతూ ఆదివాసీలతో మాట్లాడి ఆందోళన విరమించేలా చూడాలన్నారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు సంబంధిత అటవీశాఖ అధికారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వారిపై చర్యలు తీసుకుంటామని హామీనివ్వడంతో ఆదివాసులు ఆందోళనను విరమించారు. గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.