
కుభీర్, అక్టోబర్ 31 : పార్టీకి కార్యకర్తలే పునాదిరాళ్ల వంటివారని, కష్టపడే ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం కల్పించడం జరుగుతుందని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్‌రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ పార్టీ 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కుభీర్‌లోని ప్రగతి స్కూల్లో ఆదివారం మండలస్థాయి కార్యకర్తల సమావేశం మండలాధ్యక్షుడు ఎన్నీల అనిల్ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితో క్రియాశీల కార్యకర్తకు రూ.2 లక్షల బీమా కల్పించినట్లు తెలిపారు. పార్టీలో కష్టపడేవారికి ఎల్లప్పుడూ మంచి స్థానం ఉంటుందన్నారు. ప్రభుత్వ పథకాలను గడపగడపకూ తీసుకెళ్లాలని, దీంతో ప్రజల్లో మరింత అవగాహన పెరుగుతుందని పేర్కొన్నారు. కష్ట సుఖాల్లో పార్టీ మండల నాయకులు పాల్గొని కార్యకర్తలకు అండగా నిలువాలని సూచించారు. సీఎం కేసీఆర్ రానున్న రోజుల్లో మరెన్నో పథకాలను అందించనున్నారన్నారు. పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు తమ సాధకబాధకాలను చెప్పుకున్నారు. నూతనంగా ఎన్నికైన పార్టీ మండల కమిటీని ఎమ్మెల్యే అభినందించారు. సైనికుల్లా పనిచేసి పార్టీకి పేరు ప్రతిష్టలను తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తూం రాజేశ్వర్, మాజీ జడ్పీటీసీ శంకర్ చౌహాన్, నాయకులు రేకుల గంగాచరణ్, వైస్ ఎంపీపీ మొ హియుద్దీన్, పీరాజీ, కందుర్ సంతోష్, సాయినా థ్, దొంతుల రాములు, దత్తురాం కాక, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, రైతుబంధు సమితుల సభ్యు లు, ఆయా గ్రామాల కార్యకర్తలు పాల్గొన్నారు.