
వ్యవసాయ పనులకు వచ్చిన వలసకూలీలు
వానకాలం సీజన్ ఆఖరుకు చేరుకోవడంతో రాక
ఆయా మండలాలకు చేరుకున్న సుమారు 2వేల మంది
ఒక్కో బృందంలో 20 నుంచి 30 మంది
8 నెలల పాటు ఇక్కడే ఉపాధి
నిర్మల్ టౌన్, సెప్టెంబర్ 30 : నిర్మల్ జిల్లాకు బీహార్ వలస కూలీలు వచ్చేశారు. వానకాలం సీజన్ పంటలు చేతికొచ్చే సమయంలో, వీరంతా ఆయా మండలాలకు చేరుకున్నారు. ఒక్కో బృందంలో 20 నుంచి 30 మంది ఉండగా, సుమారు 2 వేల మంది పనుల కోసం వచ్చారు. 8నెలల పాటు ఇక్కడే ఉపాధి పొందనుండగా, ఆయా ప్రాంతాల్లో ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం వ్యవసాయ పనులు చేపట్టనున్నారు.
జిల్లాకు బిహార్ వలస కూలీలు వచ్చేశారు.. యేటా వానకా లం సీజన్ పంటలు చేతికొచ్చే సమయంలో ఇక్కడికి వస్తుంటారు. 8 నెలల పాటు ఇక్కడే ఉండి వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉ పాధి పొందుతారు. ఇప్పటికే జిల్లాకు 2 వేల కు పైగా బిహార్ కూలీలు వివిధ ప్రాంతాల్లో మూడు రోజులుగా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. సోయా, మక్క, పత్తి, ఇతర పంటల తూకాల్లో వీరు కూలీ పనులు చేస్తారు. అక్టోబర్, నవంబర్లో సోయా తూ కం చేయగా.. డిసెంబర్, జనవరి వరి, ఆ త ర్వాత రబీ సీజన్లో వరి, మక్కజొన్న పంటలను తూకం వేస్తూ లారీలను అన్లోడ్ చే స్తూ ఉపాధి పొందుతారు. ఇప్పటికే తానూ రు, కుంటాల, లోకేశ్వరం, నర్సాపూర్, లక్ష్మణచాంద, సారంగాపూర్, తదితర మండలాలకు కూలీలు చేరుకుంటున్నారు. క్వింటాలుకు రూ. 30చొప్పున కూలీ ఒప్పందం కుదుర్చుకొని ఒక్కోక్క బృందంలో 20-30 మంది కూలీలుండి ప్రతిరోజూ పనులు నిర్వహిస్తుంటారు. బిహార్ ప్రాంతంలో వానకా లం సీజన్లో ఒక్క పంట మాత్రమే సాగవుతుందని, రెండో పంటకు అవకాశం లేకపోవడంతో అక్కడి వ్యవసాయ కూలీలందరూ ఇక్కడికి వచ్చి ఉపాధి పొందుతున్నారు.
అక్కడ పనులు లేవు..
మా రాష్ట్రంలో పనులు లేవు. వర్షాకాలం మాత్రమే పంటలు పండుతాయి. అక్కడ ఎక్కువగా ఆలు పంట సాగు మాత్రమే చేస్తారు. జూ న్లో వేస్తే మూడు నెలల్లోనే పంట చేతికొస్తుంది. ఆ తర్వాత మాకు పనులు ఉండవు. దీంతో యేటా ఇక్కడికి పనుల కోసం వస్తున్నాం. నెలకు రూ. 15వేల నుంచి రూ. 20వేల వరకు సంపాదిస్తున్నాం.
-సందీప్, బిహార్
నాలుగేళ్లుగా ఇక్కడే ఉపాధి పొందుతున్నాం..
నాలుగేళ్లుగా ఇక్కడే ఉపాధి పొందుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో యేటా రెండు పంటలు పండుతున్నాయి. ప్రతి సంవత్సరం అక్టోబర్లో ఇక్కడికి వచ్చి మే వరకు ఇక్కడే ఉంటాం. ధాన్యం తూకం వేయడం, లారీల్లో లోడ్ చేయ డం ఇతర పనులు చేస్తాం. క్వింటాలుకు రూ. 30 చొప్పున రైతులు కూలీ డబ్బు లు చెల్లిస్తున్నారు.
-విశ్వాల్, బిహార్ కూలీ