
బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్
తాంసి/ నేరడిగొండ, సెప్టెంబర్ 30 : పేదల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్తో భరోసా ఏర్పడిందని బోథ్ ఎమ్మెల్యే రాథో డ్ బాపురావ్ అన్నారు. తాంసి ఎంపీడీవో కార్యాలయంలో భీంపూర్, తలమడుగు, తాంసి మండలాలకు చెందిన, ఆదిలాబాద్‌లోని ఆయన స్వగృహంలో నేరడిగొండ మండలానికి చెందిన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్‌ఫండ్ చెక్కులను గు రువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ.. కష్టసమయంలో నిరుపేదలకు ఈ పథకం ద్వారా అభయహస్తం లభించినట్లు అవుతుందన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఈ పథకం గురించి ఎవరికీ తెలియదని, తెలంగాణ రాష్ట్రం వచ్చాకే ఆరోగ్య శ్రీ వర్తించని సందర్భంలో సీఎంఆర్ఎఫ్ ద్వారా నిరుపేదలకు వైద్య ఖర్చులు అందుతున్నాయని పేర్కొన్నారు. అత్యవసర సమయంలో ఎల్వోసీ ద్వారా నిరుపేదల వైద్యానికి డబ్బులు విడుదల చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ లు సురుకుంటి మంజులాశ్రీధర్రెడ్డి, సంతోష్, జడ్పీటీసీ సుధాకర్, ఎంపీడీవో రవీందర్, డిప్యూటీ తహసీల్దార్ తిరుమల, టీఆర్ఎస్ మండల కన్వీనర్లు తరుడి అరుణ్‌కుమార్, తోట వెంకటేశ్, మేకల నాగయ్య, రైతుబంధు సమితి మం డల అధ్యక్షుడు గోవర్ధన్‌రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా నాయకులు సామ నాగారెడ్డి, సర్పంచ్‌లు కృష్ణ, సదానందం, కేశవ్‌రెడ్డి, శ్రీనివాస్, ఎంపీటీసీలు రఘు, అశోక్, టీఆర్ఎస్ నాయకు లు మొట్టె కిరణ్, శ్రీనివాస్‌రెడ్డి, ఆశన్న, యాదవ్ అబ్దుల్లా, విలాస్, ధనుంజయ్, గంగారాం, మహేందర్ పాల్గొన్నారు.
పేదింటి ఆడపడుచులకు కల్యాణలక్ష్మితో చేయూత..
బజార్హత్నూర్, సెప్టెంబర్ 30 : పేదింటి ఆడపడుచులకు భరోసాగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు చేయూతనిస్తున్నాయని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నా రు. బోథ్ ఎమ్మెల్యే నివాసమైన ఆదిలాబాద్‌లో తహసీల్దార్ కూన గంగాధర్ ఆధ్వర్యంలో మండలంలోని చందునాయక్ తండా, పిప్పిరి, గంగాపూర్, మంజారంతండా, వర్తమన్నూ ర్ గ్రామాలకు చెందిన ఐదుగురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేద, మధ్యతరగతి కుటుంబా ల్లో ఆడపిల్లల పెళ్లి ఖర్చుల కోసం ఇస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ రాజా రాం, నాయకులు సాయన్న, నరేశ్, శేఖర్, లక్ష్మణ్, కవిందర్, రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.