ఆదిలాబాద్ టౌన్, మార్చి 10 : సీసీఐని వెంటనే పునరుద్ధరించాలని సీపీఎం పార్టీ ప్రజాసంఘాల నాయకలు డిమాండ్ చేశారు. సీసీఐ సాధన కోసం ఆదిలాబాద్లో చేపడుతున్న దీక్ష గురువారం నాటికి 16వ రోజుకు చేరుకున్నది. దీక్షలో నాయకులు పూసం సచిన్, మయూరి ఖాన్, పోసాని, భాగ్యశ్రీ, నూర్జఖాన్, రేణుక, ఆరీఫా, సోమేశ్, మోతిరాం, లక్ష్మణ్, ఆశన్నతో పాటు 20 మంది దీక్షలో కూర్చొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీసీఐని వెంటనే పునరుద్ధరించాలని, లేకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీసీఐ సాధన కమిటీ కన్వీనర్ దర్శనాల మల్లేశ్, కో కన్వీనర్ ఇజ్జగిరి నారాయణ, అరవింద్, మునిగెల నర్సింగ్, లంక రాఘవులు, శైలేందర్, బొర్రన్న, లోకారి పోశెట్టి, బాల శంకర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.