ఇచ్చోడ ఎంపీపీ నిమ్మల ప్రీతమ్‌రెడ్డి
ఆశ కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ
ఇచ్చోడ, ఫిబ్రవరి 18 : నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆశ కార్యకర్తలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ నిమ్మల ప్రీతమ్‌రెడ్డి సూచించారు. మండల కేంద్రంతో పాటు నర్సాపూర్(బీ) గ్రామంలోని ప్రభుత్వ దవాఖానలో గురువారం ఆశ కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశ కార్యకర్తలు రోజువారీ పని వివరాలను ఆన్లైన్లో సెల్‌ఫోన్ ద్వారా నమోదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ నిమ్మల శివ కుమార్ రెడ్డి, ఉపసర్పంచ్ లోక శిరీశ్‌రెడ్డి, వైద్యాధికారి కావ్యరాజ్, నర్సాపూర్(టీ) వైద్యాధికారి రాథోడ్ హిమబిందు, హెల్త్ అసిస్టెంట్లు రాథోడ్ కైలాస్, జాదవ్ సుభాష్, వార్డు సభ్యులు, ఏఎన్ఎంలు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఇంద్రవెల్లి, ఫిబ్రవరి 18 : గ్రామీణ ప్రాంతంలోని ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఎంపీపీ శోభాబాయి, జడ్పీటీసీ పుష్పలత ఆశ కార్యకర్తలకు సూచించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 49 మంది ఆశ కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ పడ్వాల్ గోపాల్‌సింగ్, డాక్టర్ శ్రీకాంత్, మాజీ సర్పంచ్ సుంకట్రావ్, వైద్య సిబ్బంది జాదవ్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
బజార్హత్నూర్, ఫిబ్రవరి 18 : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జడ్పీటీసీ నర్సయ్య, వైస్‌ఎంపీపీ పోరెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా ఆశ కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైద్యసిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.