
ఆదిలాబాద్ ఎమ్మెల్యే రామన్న
శంకర్‌గూడ చెక్‌పోస్ట్ పరిశీలన
స్వయంగా పరీక్షలు చేసిన జోగు
బేల, ఏప్రిల్ 20 : మహారాష్ట్ర వైపు నుంచి వచ్చే ప్రయాణికులకు పకడ్బందీగా థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేయాలని పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్, వైద్యారోగ్య శాఖల అధికారులకు ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న సూ చించారు. మండలంలోని శంకర్‌గూడ గ్రామం (మహారాష్ట్ర సరిహద్దు) వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ను మంగళవారం అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహారాష్ట్రలో రోజురోజుకూ కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నందున రాకపోకలు కొనసాగించే వారి వివరాలు నమోదు చేసి, పరీక్షలు చేయాలన్నారు. పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్, వైద్యారోగ్య శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. థర్మల్ స్క్రీనింగ్‌లో టెంపరేచర్ ఎక్కువగా ఉన్నట్లు తేలితే వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్‌తో ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నందున రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ విధించినట్లు తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు. గ్రామాల్లో 45 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్, టీఆర్ఎస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గంభీర్ ఠాక్రే, నాయకులు సతీశ్ పవార్, మస్కే తేజ్‌రావు, విఠల్ వారాడే, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.