
సిర్పూర్(టీ), సెప్టెంబర్ 20 : మండలకేంద్రంతో పాటు పలు గ్రామాల్లో సోమవారం ఉదయం 11 నుంచి దాదాపు 2 గంటలకు పాటు భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బస్టాండ్ – రైల్వేస్టేషన్, సిర్పూర్(టీ)- దుబ్బగూడ కాలనీ వద్ద రోడ్ పై నుంచి నీరు ప్రవహించడంతో వాహనదారులు తీవ్ర ఇ బ్బందులు పడ్డారు. అంబేద్కర్ కాలనీలో ని ఇం డ్లలోకి వరద చేరింది. డ్రైనేజీలు లేకపోవడంతోనే వరద చేరుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
కౌటాల మండలంలో..
కౌటాల, సెప్టెంబర్ 20: మండలంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. సోమవారం వారసంత కావడంతో వ్యాపారులు, వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు.
భైంసా పట్టణంలో..
భైంసా, సెప్టెంబర్, 20 : పట్టణంలో గంటపాటు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి మార్కెట్, మిర్చి కంపౌండ్, గాంధీగంజ్, రాహుల్ నగర్ రహదారులు జలమయమయ్యాయి. దీంతో ప్రజ లు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లన్నీ చెరువులను తలపించాయి.
దస్తూరాబాద్ మండలంలో..
దస్తురాబాద్,సెప్టెంబర్20 : మండలకేంద్రంతో పలు గ్రామాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెరువులు, వాగుల్లోకి వరద నీరు వచ్చి చేరింది.
కడెం ప్రాజెక్టు రెండు గేట్ల ఎత్తివేత
కడెం, సెప్టెంబర్ 20: సోమవారం ఉదయం నుం డి భారీగా వర్షం కురవడంతో కడెం ప్రాజెక్టులోకి 13,144 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరిం ది. దీంతో అధికారులు రెండు గేట్లను ఎత్తి 18,729 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. అదేవిధంగా కుడి, ఎడమ కాలువల ద్వారా 14, 841 క్యూసెక్కులు, నీటిని విడుదల చేస్తున్నారు.
గడ్డెన్న వాగు ప్రాజెక్టు గేటు ..
భైంసా, సెప్టెంబర్, 20 : పట్టణంలోని గడ్డెన్నవా గు ప్రాజెక్టు గేటును సోమవారం అధికారులు ఎత్తివేశారు. ప్రాజెక్ట్‌లోకి ఇన్‌ఫ్లో 563 క్యూసెక్కుల ఉండగా, ఔట్ ఫ్లో కింద 4412 క్యూసెక్కుల నీటిని దిగవకు వదులుతున్నారు.
వేమనపల్లి మండలంలో ..
వేమనపల్లి, సెప్టెంబర్ 20 : మండలంలో సోమవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు భారీ వర్షం కురిసింది. పలు గ్రామాల్లో మ ట్టి రోడ్లు బురదమయంగా మారి ప్రయాణికులు ఇబ్బందులుపడ్డారు. పనులకు వెళ్లిన వ్యవసాయ కూలీలు ఇండ్లకు చేరుకున్నారు.