బజార్హత్నూర్, మార్చి 30 : వననర్సరీల నిర్వహణపై పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని డీఆర్డీవో కిషన్ సూచించారు. మండలంలోని పిప్పిరి, వర్తమన్నూర్, గిర్నూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన వననర్సరీలను బుధవారం అడిషనల్ డీఆర్డీవో రాథోడ్ రవీందర్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా డీఆర్డీవో మాట్లాడుతూ నర్సరీల్లో ఎండతీవ్రత నుంచి మొక్కలకు నీడ కలిగించేందుకు చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలని, ప్రతి రోజూ మూడు సార్లు మొక్కలకు నీరు పట్టాలని సూచించారు. అంతకుముందు పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బందితో మాట్లాడారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. గ్రామాల్లోని పారిశుధ్య పనులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. ఆయన వెంట ఎంపీడీవో మహేందర్రెడ్డి, ఏపీవో శ్రీనివాస్ ఉన్నారు.
నర్సరీ పరిశీలన
నార్నూర్, మార్చి 30 : మండలంలోని ఉమ్రి గ్రామంలో ఏర్పాటు చేసిన నర్సరీని సర్పంచ్ రాథోడ్ రవీందర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సరీలో 11వేల మొక్కలు పెంచుతున్నట్లు తెలిపారు. హరితహారానికి వందశాతం మొక్కలు అందుబాటులో ఉండేలా కృషి చేస్తామన్నారు. ఆయన వెంట టెక్నికల్ అసిస్టెంట్ వికాస్ ఉన్నారు.