97 శాతం ఇంటి పన్ను వసూలు
టార్గెట్ వంద శాతం
లక్ష్యసాధనకు అధికారుల కృషి
7 జీపీల్లో వంద శాతం వసూలు పూర్తి
దస్తురాబాద్, ఫిబ్రవరి 20 :గ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తున్నది. దీంతో గ్రామాల్లో మౌలిక వసతులు సమకూరుతున్నాయి. ప్రజలు ముందుకొచ్చి ఇంటి పన్నులు చెల్లిస్తున్నారు. పన్ను వసూళ్లలో దస్తురాబాద్ మండలం వంద శతానికి చేరువలో ఉంది. ఏడు గ్రామ పంచాయతీల్లో వంద శాతం ఇంటి పన్ను వసూలు పూర్తి అయింది. మండలంలో 97 శాతం ఇంటి పన్ను వసూలైంది.
గ్రామాల అభివృద్ధికి నిధులను ప్రభుత్వం ప్రతి నెలా నేరుగా గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ జేస్తున్నది. దీంతో పాటు ఇంటి పన్ను వసూలుకు కూడా ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఆర్థిక సంవత్సరం చివరిలో ఇంటి పన్ను వసూలు కు ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నది. అన్ని గ్రామ పం చాయతీల్లో ఇంటి పన్ను వసూలు ముమ్మరంగా సాగుతున్నది. అన్ని గ్రామ పంచాయతీలకు కలిపి రూ.16,19,265 లక్షల టార్గెట్ను నిర్దేశించగా, ఇప్పటి వరకు రూ.15,42,699లు వసూల య్యాయి. 97 శాతం వసూలు పూర్తయింది.
ఏడు గ్రామాల్లో వంద శాతం..
మండలంలో 13 గ్రామ పంచాయతీలు ఉండ గా ఏడు గ్రామ పంచాయతీల్లో వంద శాతం పన్ను వసూలు పూర్తయింది. ఆకొండపేట, బుట్టా పూర్, దేవునిగూడెం, గొడిసెర్యాల గోండు గూడెం (జీ), మున్యాల తండా, మల్లాపూర్ గోండుగూడెం, ఎర్రగుంటలో వంద శాతం పూర్తి అయ్యాయి. దస్తురాబాద్ (93.5), భూత్కూర్ (94.8), గొడి సెర్యాల(94.5), మున్యాల (92.09), పెర్కపల్లె (94.51), రేవోజిపేట (92.23) శాతం వసూలైం ది. 15 రోజుల్లో ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. ఇంటి పన్ను, ఇతర పన్ను వసూళ్లను వేగవంతం చేశారు. వంద శాతం పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం కృషి చేస్తున్నది. సర్పంచ్లు, అధికారులు, కార్య దర్శులు దృష్టి సారించారు.