డీఈవో ప్రణీత
‘ మన ఊరు – మన బడి’పై ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం
ఇచ్చోడ, ఫిబ్రవరి 21 : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకే ప్రభుత్వం మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని చేపట్టిందని జిల్లా విద్యాధికారి ప్రణీత పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జడ్పీ పాఠశాలలో సోమవారం ఇచ్చోడ, సిరికొండ మండలాల ప్రజాప్రతినిధులు, అధికారులతో ‘మన ఊరు -మన బడి’ కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల బోధనను పకడ్బందీగా అమలు చేస్తామన్నారు. ఎంపిక చేసిన పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన ప్రక్రియను సంబంధిత ఇంజినీర్ అధికారులు పూర్తి చేయాలని సూచించారు. 12 అంశాలతో బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బడులను దత్తత తీసుకునేందుకు దాతలు ఉంటే ముందుకు రావాలన్నారు. సమావేశంలో ఎంపీపీలు నిమ్మల ప్రీతమ్‌రెడ్డి, అమృత్ రావ్, జడ్పీటీసీ కదం సుభద్రబాయి, ఎంపీడీవో రాంప్రసాద్, మండల విద్యాధికారి రాథోడ్ ఉదయ్‌రావ్, పీఆర్ ఏఈలు సతీశ్, జాదవ్ అభినవ్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పాఠశాలల బలోపేతమే లక్ష్యం
నార్నూర్, ఫిబ్రవరి 21 : ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యమని ఎంపీపీ కనక మోతుబాయి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నార్నూర్, గాదిగూడ మండలాల్లో మొత్తం 19 పాఠశాలలను మన ఊరు – మన బడి కింద ఎంపికయ్యాయని తెలిపారు. పాఠశాలల్లో కావాల్సి సదుపాయాలు, అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు వంటి వాటి వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. అధికారులు. ప్రజాప్రతినిధులకు సలహాలు, సూచనలు అందించారు. పాఠశాలల వారీగా ప్రణాళికలు తయారు చేయాలని, ప్రతిపాదనలను కలెక్టర్‌కు పంపిస్తామని సూచించారు. కార్యక్రమంలో ఎంఈవో రాపెల్లి ఆశన్న, ఎంపీడీవో రమేశ్, ఐటీడీఏ ఏఈ రాథోడ్ సునీల్, సర్పంచ్‌లు పాల్గొన్నారు.
‘మన ఊరు- మన బడి’ కార్యక్రమంపై శిక్షణ
జైనథ్, ఫిబ్రవరి 21 : మండల కేంద్రంలోని ఎంఈవో కార్యాలయంలో సర్పంచ్‌లు, పాఠశాలల చైర్మన్లు, ప్రధానోపాధ్యాయులకు ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమంపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంఈవో నారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, పక్కా భవనాలు, నీటి సదుపాయం లాంటి 12 అంశాలను కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. కార్యక్రమంలో మండల నోడల్ ఇంజినీరింగ్ అధికారి శశిధర్, తదితరులు పాల్గొన్నారు.
అవగాహన సదస్సు
గుడిహత్నూర్, ఫిబ్రవరి 21 : మండల కేంద్రంలోని ఎమ్మార్సీ భవనంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సర్పంచ్‌లు, విద్యా కమిటీ చైర్మన్లకు మన ఊరు-మన బడిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, పూర్వ విద్యార్థులు పాఠశాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ భరత్, సర్పంచ్‌లు జాదవ్ సునీత, మీనా, ఈవోపీఆర్డీ లింగయ్య పాల్గొన్నారు.
బోథ్, ఫిబ్రవరి 21 : మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో మన ఊరు-మన బడి కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. మండల వ్యాప్తంగా ఎంపికైన 17 పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎస్ఎంసీ చైర్మన్లు, సర్పంచ్‌లకు పథకం అమలుపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి భూమారెడ్డి, ఎంపీడీవో రాథోడ్ రాధ, సీఆర్పీలు పాల్గొన్నారు.
నేరడిగొండ, ఫిబ్రవరి 21 : మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రధానోపాధ్యాయులకు మన ఊరు-మన బడి కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈవో భూమారెడ్డి మాట్లాడుతూ పాఠశాలలకు అవసరమైన వసతులు గుర్తించాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ రాథోడ్ సజన్, ఎంపీడీవో అబ్దుల్ సమద్, ఎంపీవో శోభన పాల్గొన్నారు.