
నార్నూర్, సెప్టెంబర్ 23: కరోనా నియంత్రణకు 18 ఏళ్లు నిండిన వారు వ్యాక్సిన్ వేయించుకోవాలని ఎంపీపీ కనక మోతుబాయి అన్నారు. మండలంలోని దుప్పాపూర్లో నిర్వహించిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని డీఎల్పీవో భిక్షపతిగౌడ్‌తో కలిసి గురువారం సందర్శించారు. ప్రతి ఒక్కరికి టీకా వేసేలా చూడాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఆమె వెంట కార్యదర్శి వెంకటేశ్, నాయకుడు కనక ప్రభాకర్, వైద్య సిబ్బంది ఉన్నారు.
గ్రామాల్లో విస్తృత ప్రచారం
గాదిగూడ మండలంలోని ఖండో గ్రామంలో కొవిడ్ వ్యాక్సినేషన్‌పై విస్తృత ప్రచారం నిర్వహించారు. పంచాయ తీ పరిధిలోని కట్టగూడలో వ్యాక్సిన్ కేంద్రం ఏర్పాటు చేయ డంతో స్పందన లభించిందని సర్పంచ్ హెచ్‌కే చంద్రహరి, కార్యదర్శి శ్రీధర్ తెలిపారు. ఒకే రోజు 100మందికి పైగా టీకా తీసుకున్నారని వైద్య సిబ్బంది ఊర్మిళ తెలిపారు. నార్నూర్ మండలం మాన్కాపూర్లో వ్యాక్సినేషన్ సెంటర్ నిర్వహించారు.
స్థానిక ఎన్టీఆర్ నగర్లో వ్యాక్సినేషన్ శిబిరాన్ని ఎంపీడీవో తిరుమల గురువారం పరిశీలించారు. కార్యక్రమంలో జీపీ ఈవో సత్యనారాయణ, స్థానికులు ఉన్నారు. దుర్గాపూర్‌లో ఏర్పాటు చేసిన కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లో మత్తడిగూడ సర్పంచ్ మడావి యశోదాబాయి టీకా వేసుకున్నారు. కార్యక్రమంలో గ్రామ పటేల్ మోతీరాం, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, గ్రామస్తులు ఉన్నారు.
కొనసాగుతున్న వ్యాక్సినేషన్
మండల కేంద్రంతో పాటు రఘునాథ్‌పూర్, ధన్నూర్ (బీ), జీడిపల్లె, కరత్వాడ తదితర గ్రామాల్లో గురువారం కరోనా టీకాలు వేశారు. వ్యాక్సినేషన్ కేంద్రాలను సొనాల పీహెచ్సీ డాక్టర్ కే నవీన్‌రెడ్డి, హెచ్ఈ వెంకటలక్ష్మి, సూపర్ వైజర్లు నర్సింహస్వామి, కళావతి, జాహెద పర్యవేక్షించారు. శిబిరాల్లో ఏఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్లు, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు.
మండలంలోని కప్పర్ల, ఘోట్కూరి, హస్నాపూర్, నిపాని, తాంసిలో కొవిడ్ వ్యాక్సినేషన్ ముమ్మరంగా కొనసాగుతున్నది. హస్నాపూర్‌లో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తయినట్లు ఏఎన్ఎం సుగుణ తెలిపారు. బండల నాగాపూర్, గిరిగాం, పొన్నారిలో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తయినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు కృష్ణ, నర్సింగ్, సదానందం, ఏఎన్ఎం లక్ష్మి, ఆశ, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
మండలంలోని డోప్టాల, మసాల (బీ), దౌన, సైద్పూర్ , బేల తదితర గ్రామాల్లో గురువారం కొవిడ్ వ్యాక్సినేషన్ కొనసాగింది. ప్రజలు స్వచ్ఛందంగా వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. కార్యక్రమంలో మండల పంచాయితీ అధికారి సమీర్ హైమద్, డోప్టాల సర్పంచ్ రాకేశ్, వైద్య సిబ్బంది లలిత, రాజమణి, ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, ఐకేపీ వీవోఏలు పాల్గొంటున్నారు.
వాగులు దాటి.. గుట్టలెక్కి
భీంపూర్ మండలంలో సగానికి పైగా గిరిజన పంచాయతీలు, అనుబంధ గ్రామాల్లో కొవిడ్ టీకా స్పెషల్ డ్రైవ్ ముమ్మరంగా కొనసాగుతున్నది. సిబ్బంది వాగులు దాటుతూ, గుట్టలెక్కుతూ ఆయా గ్రామాలకు చేరుకొని వ్యాక్సిన్ వేస్తున్నారు. కరంజి(టీ) పంచాయతీలోని గుట్టమీద ఉన్న అటవీ సమీప గిరిజన గ్రామం రాజులవాడి, జలకొరి పంచాయతీలో మొదటి డోసు టీకాలు వేశారు. రాజులవాడిలో మొత్తం జనాభా 210 కాగా అర్హులైన 142 మంది టీకా వేసుకున్నారు. జలకొరి పంచాయతీ అనుబంధ గ్రామం రాజీవ్‌నగర్‌ను కలిపి జనాభా 305 మంది కాగా, అర్హులు 215 మంది టీకా తీసుకున్నారు. ఇక్కడ సర్పంచ్ మడావి అనిల్ ముందుగా టీకా వేసుకున్నారు. గిరిజన గ్రామాల్లో వందశాతం వ్యాక్సినేషన్‌కు స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యదర్శులు, ఉపకేంద్రాల సిబ్బంది చిత్తశుద్ధితో పని చేస్తున్నారని సూపర్వైజర్లు గంగాధర్, విష్ణు తెలిపారు. శిబిరాల్లో శిబిరంలో సర్పంచ్‌లు జీ స్వాతిక, అనిల్, ఏఎన్ఎంలు సుజాత, నఫీజా, లచ్చుబాయి, కార్యదర్శులు నితిన్, సందీప్, ఆశ, అంగన్వాడి కార్యకర్తలు ఉన్నారు.