
గరుడ యాప్‌లో వివరాలు నమోదు
జిల్లాలో 916 పీఎస్‌లు..
ఇప్పటికే 491 కేంద్రాల్లో ముగిసిన సర్వే
మార్పులు చేర్పులకు అవకాశం
సద్వినియోగం చేసుకోవాలంటున్న అధికారులు
నిర్మల్ అర్బన్, అక్టోబర్ 7: పోలింగ్ కేంద్రాలు కొత్త హంగులు అద్దుకోనున్నాయి. ఓటర్లకు, ఎన్నికల అధికారులకు ఇబ్బందులు తలెత్తకుండా పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించడంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టింది. ఈ మేరకు గరుడ యాప్‌ను రూపొందించి, పోలింగ్ కేంద్రాల స్థితిగతులపై ఆరా తీస్తున్నది. జిల్లాలో 916 పీఎస్లుండగా, ఇప్పటికే 491 కేంద్రాల స్థితిగతులను సిబ్బంది పొందుపర్చింది. ఈ యాప్‌లో ఓటరు నమోదు, మార్పులు.. చేర్పులకు అవకాశం కల్పించగా, సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నది.
రాష్ట్ర ఎన్నికల కమిషన్, ప్రభుత్వం పోలింగ్ కేంద్రాలకు కొత్త హంగులు కల్పిస్తున్నది. పోలింగ్ కేంద్రాలను ఆన్లైన్ చేసేందుకు గరుడ యాప్‌ను రూపొందించింది. దీనిద్వారా ఎన్నికల స మయంలో తాత్కాలిక సౌకర్యాలు ఏర్పాటు చేసి, హడావిడిగా ఎన్నికలను నిర్వహించే బదులు ఓటర్లకు, విధులు నిర్వహించేందుకు వచ్చిన అధికారులకు ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా ఉం డేందుకు ముందు నుంచే పోలింగ్ కేంద్రాల స్థితిగతులపై ఆరా తీస్తున్నది. జిల్లాలో గతం లో ఎన్ని కేంద్రాలు ఉన్నాయి.. ప్రస్తుతం ఆ యా కేంద్రాలు ఎన్నికల నిర్వహణకు అనుకూలంగా.. ఉందా..? లేదా..? అన్న వివరాలను యాప్‌లో నమోదు చేస్తున్నారు. దీని ఆధారంగా శిథిలావస్థలో ఉన్న కేంద్రాల్లో మెరుగైన వసతుల కల్పనకు కృషి చేయనుంది. మరీ అధ్వానంగా ఉన్న కేంద్రాల్లో శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టడంతో పాటు నూతన పో లింగ్ కేంద్రాల ఏర్పాటుకు మార్గం సుగమం కానుంది. యాప్‌లో వివరాల నమోదుకు బీఎల్వోలకు శిక్షణను సైతం ఇచ్చారు. ఇప్పటికే బీఎల్వోలు పోలింగ్ కేంద్రాల్లో తిరుగుతూ యాప్‌లో వివరాలు నమోదు చేస్తున్నారు.
నిర్మల్ జిల్లాలో 916 కేంద్రాలు
జిల్లాలోమూడు నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో నిర్మల్‌లో 302 పోలింగ్ కేంద్రాలు, ఖానాపూర్‌లో 303, ముథోల్‌లో 311 కేం ద్రాలు మొత్తం 916 కేంద్రాల్లో అధికారులు నిర్వహిస్తున్నారు. ఇందులో ఇప్పటివరకు 491 పోలింగ్ కేంద్రాల వివరాలను అధికారు లు, బీఎల్వోలు యాప్‌లో నమోదు చేశారు.
క్లుప్తంగా వివరాల నమోదు..
జిల్లాలోని 916 మంది బీఎల్వోలు తమ పోలింగ్ కేంద్రాల పరిధిలో ఉన్న స్థితిగతులను యాప్‌లో క్లుప్తంగా వివరాలను నమోదు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రం ఫొటోను లొకేషన్ యాప్‌లో అప్లోడ్ చేస్తారు. కేంద్రంలోకి వెళ్లేందుకు దివ్యాంగులు, వృద్ధుల కోసం ర్యాంప్ ఉందా. .శాశ్వత విద్యుత్ సదుపాయం ఉందా, వెంటిలేషన్ (వెలుతురు) సదుపా యం, ఫర్నీచర్, మరుగుదొడ్లు, తాగునీటి వస తి, ఇంటర్నెట్, రోడ్డు సదుపాయం వివరాలు నమోదు చేస్తున్నారు. భవనం ప్రభుత్వానిదా, ప్రైవేట్‌దా.. పాఠశాలనా? కళాశాలనా.. పోలిం గ్ కేంద్రం ఉపయోగంలో ఉందా…శిథిలావస్థలో ఉందా అనే వివరాలను యాప్‌లో న మోదు చేస్తున్నారు. వివరాల ఆధారంగా అధికారులు వసతుల కల్పన, నూతన పోలింగ్ కేంద్రాల మార్పులు చేసి రానున్న ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నారు.
ఓటరు నమోదుకు అవకాశం…
రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిన యా ప్లో పోలింగ్ కేంద్రాల వసతులతో పాటు ఓటరు నమోదుకు అవకాశం, పేరు తొలగిం పు, పేరు, వయస్సు మార్పులు, చేర్పులు చేసుకునే వెసులుబాటును కల్పించారు. దీంతో 18 ఏళ్లు నిండిన వారితో పాటు తప్పులున్నవారు సైతం యాప్ ద్వారా సరి చేసుకోవచ్చు.
ముందే సౌకర్యాలు గుర్తించడం మంచి నిర్ణయం ..
పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు సరిగా లేక విధులు నిర్వహించే ఉద్యోగులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రు. మరీ ముఖ్యంగా మ హిళా ఉద్యోగులు అనేక అ వస్థలు పడుతున్నారు. ఓటర్లు, ఎన్నికల వి ధులు నిర్వహించే ఉద్యోగుల ఇబ్బందులను ముందే గుర్తించిన ప్రభు త్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టడం అభినందనీయం.
-జుట్టు గజేందర్, ఎస్టీయూ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు