నిర్మల్ డీఈవో రవీందర్రెడ్డి
విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ
నిర్మల్ అర్బన్, ఫిబ్రవరి 21 : పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చాలని డీఈవో రవీందర్ రెడ్డి సూచించారు. మాతృభాషా దినోత్సవం సందర్భంగా నిర్మల్లోని ప్రభుత్వ కస్బా ఉన్నత పాఠశాలలో సోమవారం పదో తరగతి విద్యార్థులకు పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్ ఉంటుందని అన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో పాఠశాలలకు మహర్దశ చేకూరుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఏఎంవో నారాయణ, ప్రవీణ్, ప్రధానోపాధ్యాయులు తఫీయోద్దీన్ పాల్గొన్నారు.
దాతల సహకారం వెలకట్టలేనిది
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను అన్ని విధాలుగా ఆదుకునే దాతల సహకారం వెలకట్టలేనిదని డీఈవో రవీందర్ రెడ్డి అన్నారు. నిర్మల్లోని ఈద్గాం ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న 35 మంది విద్యార్థులకు ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు జుట్టు గజేందర్ ఆధ్వర్యంలో స్టడీ మెటీరియల్ను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు మధుసూదన్, ఉపాద్యాయులు పాల్గొన్నారు.