ఐదు కేటగిరీల్లో నిర్వహణ
ఎంట్రీలకు ఆఖరు మార్చి 15
విజేతలకు నగదుతో పాటు సర్టిఫికెట్లు ప్రదానం
మంచిర్యాల, నమస్తే తెలంగాణ/హాజీపూర్/ మంచిర్యాల అర్బన్, ఫిబ్రవరి 19 : జాతీయ ఓటర్ల దినోత్సవం -2022 సందర్భంగా భారత ఎన్నికల సంఘం ఓటరు అవగాహన పోటీలు నిర్వహిస్తున్నది. ‘నా ఓటే నా భవిష్యత్తు – ఒక్క ఓటుతో శక్తి’ అనే అంశంపై ప్రజల్లో అవగాహన, ఆసక్తి పెంపొందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నది. సిస్టమేటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రోరల్ పార్టిసిపేషన్ కార్యక్రమం ద్వారా సృజనాత్మకత, కళాత్మక విలువలను వెలికితీయనున్నది. క్విజ్, నినాదాలు (స్లోగన్స్), పాటలు, వీడియో మేకింగ్, పోస్టర్ డిజైన్ పోటీలు నిర్వహించనుండగా, విజేలకు నగదుతో పాటు ఈ-సర్టిఫికెట్లు అందించనున్నది.
ప్రజాస్వామ్య పునాదులను దృఢం చేసే దిశగా జాతీయ ఓటరు దినోత్సవం-22 సందర్భంగా భా రత ఎన్నికల సంఘం ‘నా ఓటే నా భవిష్యత్ -ఒక్క ఓటుకు న్న శక్త్తి’ అనే అంశంపై ప్రజల్లో అవగాహన, ఆసక్తిని పెంపొందించేలా అవగాహన పోటీలు నిర్వహిస్తున్నది. మార్చి 15 వర కు ఈ పోటీలు నిర్వహించనున్నట్లు మంచిర్యాల కలెక్టర్ భా రతీ హోళికేరి తెలిపారు. ఎన్నికల సంఘం ‘సిస్టమేటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్’ కార్యక్రమం ద్వారా ప్రజల్లో దాగి ఉన్న కళాత్మక, సృజనాత్మక విలువలను వెలికితీయనున్నారు. అన్ని వయసుల వారిలో ఓటు విలువను పెంపొందించుకునేలా ప్రోత్సహించనున్నారు. జాతీయ స్థాయిలో క్విజ్, నినాదాలు (స్లోగన్స్), పాటలు, వీడియో మేకింగ్, పోస్టర్ డిజైన్ పోటీలుంటాయి.
క్విజ్ పోటీ : ఆసక్తి ఉన్న, మేధో సంపతి ఉన్న వ్యక్తుల కోసం, వారికి దేశంలో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియపై అవగాహన, విజ్ఞానంపై ప్రశ్నలుంటాయి. దీనిలో మూడు లెవల్స్ (తేలిక, మధ్యస్థ, కఠినం) ఉంటాయి. మూడు లెవల్స్‌లో విజయం సాధించిన అభ్యర్థులకు ఈ- సర్టిఫికెట్లు అందజేస్తారు.
స్లోగన్స్ (నినాదాల పోటీ) : ఇందులో పాల్గొనే అభ్యర్థులు చక్కటి భావాలతో పైన తెలిపిన అంశంపైన మనస్సుకు హత్తుకునే నినాదాలు రాయాలి.
పాటల పోటీ : ఇందులో పాల్గొనే వారు పైన తెలిపిన అంశంపై పాటలు పాడాలి (శాస్త్రీయ సంగీతం, సమకాలీన సంగీతం, ర్యాప్ మొదలైనవి ఏదైనా కావచ్చు). అయితే అభ్యర్థులు పై అంశంపైన సొంత కాంపోజిషన్స్ మాత్రమే పాడాలి. కళాకారులు, సింగర్స్ వారికి నచ్చిన ఏదైనా ఇన్‌స్ట్ట్రుమెంట్ (వాయిద్యా పరికరం)ను వాడుకోవచ్చు. పాట నిడివి మూడు నిమిషాలకు మించి ఉండకూడదు.
వీడియో మేకింగ్ పోటీ : కెమెరా, సినీ ప్రేమికుల కోసం ఈ పోటీ ఉంటుంది. పైన తెలిపిన అంశంతో పాటు భారతీయ ఎన్నికల నిర్వహణ, వైభవం, విభిన్నత మొదలైన అంశాలపైన షార్ట్ ఫిల్మ్‌లు రూపొందించాలి. వాటితో పాటు ప్రజలకు ఓటుపై అవగాహన, నైతిక ఓటింగ్ (ప్రలోభాలకు లొంగని ఓటింగ్), ఓటుకున్న శక్తి, ఓటింగ్ ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్, నవ యువత, మొదటిసారి ఓటు వేస్తున్న వారు, మొదలైన వారికి స్ఫూర్తినిచ్చేందుకు అంశాలపైన చిత్రాలు తీయవచ్చు. పాట పాడి ఒక వీడియో రూపొందించవచ్చు. వీడియో ఫిల్మ్ నిడివి కేవలం నిమిషం మాత్రమే ఉండాలి. వీడియో, పాట, స్లోగన్స్ పోటీ లో పాల్గొనే అభ్యర్థులు తమ ఎంట్రీలను భారత రాజ్యాంగపు 8వ షెడ్యూల్ నిర్దేశించిన ఏ భాషలోనైనా సమర్పించవచ్చు.
పోస్టర్ డిజైన్ పోటీ : ఆర్ట్, డిజైన్‌ను ప్రేమించే చిత్రకారుల కోసం ఈ పోటీ నిర్వహిస్తున్నారు. వీరు పైన తెలిపిన అంశంపైన ఆలోచనలను రేకెత్తించే స్ఫూర్తివంతమైన పోస్టర్‌ను సృష్టించవచ్చు. అభ్యర్థులు ఒక డిజిటల్ పోస్టర్, స్కేల్ లేదా హ్యాండ్ పెయింటెడ్ పోస్టర్లను సమర్పించవచ్చు.
ప్రతి కేటగిరీలో బహమతులు..
ప్రతి కేటగిరీలో ఎంపికైన ప్రధాన విజేతలకు నగదు బహుమతులు, స్పెషల్ మెన్షన్ కేటగిరీ కింద నగదు బహుమతులను అందించనున్నారు. ఇన్సిట్యూషనల్ కేటగిరీ పాటల పోటీలో ప్రథమ బహుమతి రూ.లక్ష, ద్వితీయ బహుమతి రూ.50 వేలు, తృతీయ బహుమతి రూ.30 వేలు, ప్రత్యేక ప్ర శంస రూ.15 వేలుగా నిర్ణయించారు. వీడియో మేకింగ్ పోటీ లో ప్రథమ బహుమతి రూ.2 లక్షలు, ద్వితీయ బహుమతి రూ.లక్ష, తృతీయ బహుమతి రూ.75 వేలు, ప్రత్యేక ప్రశంస రూ. 30 వేలుగా ఉంటుంది. ప్రొఫెషనల్ కేటగిరీలో పాటల పోటీలో ప్రథమ బహుమతి రూ.50 వేలు, ద్వితీయ బహుమతి రూ.30 వేలు, తృతీయ బహుమతి రూ.20 వేలు, ప్రత్యే క ప్రశంస రూ.10 వేలు, వీడియో మేకింగ్ పోటీలో ప్రథమ బహుమతి రూ.50 వేలు, ద్వితీయ బహుమతి రూ.30 వేలు, తృతీయ బహుమతి రూ.20 వేలు, ప్రత్యేక ప్రశంస రూ.10 వేలు, పోస్టర్ డిజైన్ పోటీల్లో ప్రథమ బహుమతి రూ.50 వేలు, ద్వితీయ బహుమతి రూ.30 వేలు, తృతీయ బహుమతి రూ.20 వేలు, నాలుగో బహుమతి రూ.10 వేలు, ప్రత్యేక ప్రశంస రూ.5 వేలుగా నిర్ణయించారు.
అమెచ్యూర్ కేటగిరీలో పాటల పోటీలో ప్రథమ బహుమతి రూ.20 వేలు, ద్వితీయ బహుమతి రూ.10 వేలు, తృతీయ బహుమతి రూ.7,500, ప్రత్యేక ప్రశంస రూ.3 వేలు, వీడియో మేకింగ్ పోటీలో ప్రథమ బహుమతి రూ.30 వేలు, ద్వితీయ బహుమతి రూ.20 వేలు, తృతీయ బహుమతి రూ.10 వేలు, ప్రత్యే క ప్రశంస రూ.5 వేలు, పోస్టర్ డిజైన్ పోటీలో ప్రథమ బహుమతి రూ.20 వేలు, ద్వితీయ బహుమతి రూ.10 వేలు, తృ తీయ బహుమతి రూ.7,500, ప్రత్యేక ప్రశంస రూ. 3 వేలు గా నిర్ణయించారు. నినాదాల పోటీలో ప్రథమ బహుమతి రూ.20 వేలు, ద్వితీయ బహుమతి రూ.10 వేలు, తృతీయ బహుమతి రూ.7,500, ప్రత్యేక ప్రశంస కింద 50 మందికి రూ.2 వేల చొప్పున ఇవ్వనున్నారు. క్విజ్ పోటీలో విజేతలకు ఈసీఐ మర్చండైజ్ పొందనున్నారు. మూడు స్థాయిలు పూర్తి చేసిన వారికి ఈ – సర్టిఫికెట్లను బహుమతిగా ఇవ్వనున్నారు.
ఎలా పాల్గొనాలి?
అభ్యర్థులు పోటీకి సంబంధించిన మార్గదర్శకాలు, నియమ నిబంధన సంపూర్ణ సమాచారం కోసం వెబ్సైట్ http://ecisveep.nic.in/contes/ ను దర్శించవచ్చు.
అభ్యర్థి తమ వివరాలతో పాటు తమ ఎంట్రీలను voter-contest@eci.gov.inకు ఈ-మెయిల్ ద్వారా పంపాలి. అభ్యర్థి తాము పంపుతున్న < పోటీ> పేరు < కేటగిరి> లను ఈ-మెయిల్ సబ్జెక్ట్‌లో క్లియర్‌గా రాయాలి.
క్విజ్ పోటీలో పాల్గొనేవారు పోటీ వెబ్సైట్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలి.
అన్ని ఎంట్రీలు మార్చి 15, 2022 వరకు పంపాలి. ఈ-మెయిల్ ఐడీ voter-contest@eci.gov.inకు అభ్యర్థులు అన్ని వివరాలతో పంపాలి.