ఇంద్రవెల్లి, ఫిబ్రవరి 21 : మండలంలోని కెస్లాపూర్ నాగో బా ఆలయంలో విజయ డెయి రీ రాష్ట్ర చైర్మన్ లోక భూమారెడ్డి మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరీబాయితో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనం తరం మెస్రం వంశీయుల పీఠా ధిపతి మెస్రం వెంకట్రావ్ పటే ల్ ఆధ్వర్యంలో వారిని శాలువా తో సన్మానించి జ్ఞాపికను అం దించారు. ఈ సందర్భంగా భూమారెడ్డి మాట్లా డుతూ చరిత్రలో నిలిచిపోయేలా మెస్రం వంశీ యుల ఆధ్వర్యంలో నాగోబా ఆలయం నిర్మించ డం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. మెస్రం వంశీయులను ఆదర్శంగా తీసుకొని ఆధ్యాత్మికతపై ప్రజలు దృష్టి సారించాలని సూచిం చారు. సర్పంచ్ మెస్రం రేణుకానాగ్‌నాథ్, బాధిరావ్ పటేల్, లింబారావ్ పటేల్, హాకీ అసోసి యేషన్ జిల్లా అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్‌రెడ్డి, ఆనంద్ రావ్, పూజారి మెస్రం షేకు, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మహ్మద్ అబ్దుల్ అమ్జద్, టీఆర్ఎస్ మాజీ మండలాధ్యక్షుడు షేక్ సుఫి యాన్, మాజీ ఎంపీటీసీ కనక హనుమంత్‌రావ్ తదితరులు పాల్గొన్నారు.