ఎదులాపురం,నవంబర్9: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని డీఎల్ఎస్ఏ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బీఎస్ జగ్జీవన్ కుమార్ అన్నారు. న్యాయ సేవా దినోత్సవం సందర్భంగా జిల్లా కోర్టు అవరణలో మంగళవారం నిర్వహించిన ప్రభాత్ భేరి ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ కోర్టు నుంచి కలెక్టర్‌చౌక్ వరకు కొనసాగింది ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులు, పీపీలు,ఎన్జీవోల ప్రతినిధులు మానవహారంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడారు. న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అందించే సేవలపై విస్తృత అవగాహన కల్పించే దిశగా సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో డీఎల్ఎస్ఏ కార్యదర్శి క్షమాదేశ్‌పాండే, అదనపు ఎస్పీ వినోద్ కుమార్, న్యాయామూర్తులు, పీపీలు, న్యాయవాదులు, డీసీపీవో రాజేంద్రప్రసాద్, సఖీ కేంద్రం నిర్వాహకురాలు యశోద, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని బోథ్ కోర్టు న్యాయమూర్తి బీ హుస్సేన్ అన్నారు. జాతీయ న్యాయ సేవా దినోత్సవం సందర్భంగా జీడీపల్లె గ్రామంలో మంగళవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడారు. చట్టాల గురించి తెలియకపోవడంతో నేరాలు పెరిగిపోతున్నాయన్నారు. విద్యాహక్కు చట్టం, బాల్య వివాహాలు, బాలకార్మికుల నిర్మూలన, మోటర్ వెహికిల్ చట్టం, 1/70 పెసా భూ బదలాయింపు, అటవీ హక్కులు, పోడు భూములు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బోథ్ బార్ అసోసియేషన్ కార్యదర్శి పంద్రం శంకర్, న్యాయవాదులు మోహన్రావ్, కుమ్మరి విజయ్,అంగద్ కేంద్రె, ఎస్ఐ రాజు, విశేశ్వర్‌రావు, మోహన్, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. మహిళల రక్షణకు చట్టాలు ఉన్నాయని జిల్లా న్యాయసేవాధికార సంస్థ న్యాయవాది భద్రేశ్వర్రావు అన్నారు. బోథ్‌లోని బాలికల పాఠశాలలో అంగన్వాడీ టీచర్లు, విద్యార్థులకు మంగళవారం అవగాహన కల్పించా రు. ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాల న్నారు. కార్యక్రమంలో సీడీపీవో సౌందర్య, ఉపాధ్యా యులు ,విద్యార్థులు పాల్గొన్నారు.